నందమూరి కుటుంబం ప్రస్తుతం పూర్తి బాధలో ఉంది. వారి కుటుంబంలో కీలకమైన వ్యక్తి,
ఈ రోజు వారి మధ్య లేడు. దాంతో వారు ఎంతో వేదనకు గురవుతున్నారు.
కొద్ది రోజుల పాటు షూటింగ్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రం చిత్రీకరణ,
ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పుడు ఈ షెడ్యూల్ పోస్ట్ పోన్ అయింది.
కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించాల్సిన కొత్త సినిమాను ఫిబ్రవరి 24న ఘనంగా ప్రారంభించాలనుకున్నారు.
కాని తారక్ రత్న విషాదం తర్వాత ఇఫ్పుడు ఈ సినిమా ఓపెనింగ్ ను వాయిదా వేసారు.
ఇటు బాలయ్య, అటు తారక్ ఇద్దరు మార్చి రెండో వారం నుంచి షూటింగ్స్ కు అందుబాటులో ఉండే విధంగా
ఆలోచనలు చేస్తున్నారు. అప్పటి వరకు షూటింగ్స్ కు అందుబాటులో ఉండమని దర్శకనిర్మాతలకు తేల్చి చెప్పారట.