ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కార్‌పై జనంలో వ్యతిరేకత మొదలైందా ? ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనపై ప్రజలు సంతృప్తిగా లేరా ? మూడేళ్లకే ప్రస్తుత ప్రభుత్వంపై విరక్తి కలిగిందా ? పట్టణ, నగరాల ప్రజలు వైసీపీని విశ్వసించడం లేదా ? 30 ఏళ్ల పాటు అధికారం మాదేనంటున్న వైసీపీ నేతలకు…ప్రజలు షాకిస్తున్నారా ? జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లకు పెద్దగా స్పందన రాకపోవడానికి విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి ఒకటి తలిస్తే…దైవమొకటి తలిచినట్లుంది ఏపీ ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లకు స్పందన కరువైంది. పట్టణాల్లో మధ్య తరగతి ప్రజలకు…తక్కువ ధరల్లో స్మార్ట్ టౌన్ షిప్‌లను అందించాలని భావించింది. మిడిల్ క్లాస్‌కు సొంతింటి కలను సాకారం చేసేందుకు…రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి నగరంలో…టౌన్ షిప్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. లే ఔట్లు వేయడమే కాకుండా…అన్ని రకాల వసతులు కల్పించాలని సంకల్పించింది. ఎంపిక చేసిన నగరాల్లో స్మార్ట్ టౌన్‌షిప్‌ల నిర్మాణం కోసం…ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తుండటంతో…మంచి స్పందన వస్తుందని జగన్ సర్కార్ లెక్కలు వేసుకుంది.
మూడో రాజధానిగా వైజాగ్‌లోనూ స్మార్ట్ టౌన్ షిప్‌లపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం నమ్మి డబ్బు పెడితే…రెండేళ్ల తర్వాత కొత్త ప్రభుత్వం వస్తే ఏంటన్న ఆలోచన జనంలో మొదలైంది. పాలన రాజధాని కావడంతో…జనం నుంచి ఊహించని స్పందన వస్తుందని అంచనా వేసింది. స్మార్ట్ టౌన్ షిప్‌ల్లో ప్లాట్ల కొనుగోలుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రం అసలే అప్పుల్లో ఉండటంతో జనంలో ఆలోచన మొదలైంది. మెజార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి…ప్రతి నెలా ప్రభుత్వం అప్పులు చేస్తోంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం…ఏపీ అప్పులపై హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కువ అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్‌టెన్‌లో ఉంది. స్మార్ట్ టౌన్ షిప్‌ల కోసం డబ్బును చెల్లిస్తే…పథకాలకు మళ్లిస్తుందన్న అనుమానం జనంలో మొదలైంది. చేతిలో ఉన్న డబ్బును స్థలం కోసం ఖర్చు చేస్తే…ప్రభుత్వం సకాలంలో ప్లాట్లు అప్పగించకపోతే పరిస్థితి ఏంటని జనం చర్చించుకుంటున్నారు. అప్పులు చేసి డబ్బు చెల్లించినా…టౌన్ షిప్‌లు అభివృద్ది అవుతాయన్న గ్యారెంటీ లేదు. పట్టణ ప్రాంత ప్రజలు జగన్ అంటే నమ్మే పరిస్థితులు లేకుండాపోయాయ్. ఇప్పుడు ఇలా ఉంటే…ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో అన్న టెన్షన్ వైసీపీ నేతల్లో మొదలైనట్లు తెలుస్తోంది.
జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల్లో…ప్రభుత్వ ఉద్యోగులకు ప్లాట్లను రిజర్వేషన్ చేసింది. లే ఔట్ మొత్తం…10 శాతం వారికేనంటూ ప్రకటించేసింది. టౌన్‌షిప్ ఏర్పాటు చేసిన అసెంబ్లీ పరిధిలోని ఉద్యోగులకు..20 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. స్థలం కావాల్సిన ఉద్యోగులు…ఫాం-16 సమర్పిస్తే చాలని చెప్పింది.
ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు పది శాతం మొత్తాన్ని చెల్లించాలి. అగ్రిమెంటుకు ముందు 30 శాతం, ఆరు నెలల తర్వాత మరో 30 శాతం, ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో మిగిలిన 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం పూర్తిగా అభివృద్ధి చేసిన ప్లాట్లను లబ్దిదారులకు కేటాయిస్తామని చెప్పింది. అయితే టౌన్ షిప్‌లపై జగన్ సర్కార్ ఎన్ని చెప్పినా జనం మాత్రం నమ్మడం లేదు. స్మార్ట్ టౌన్ షిప్‌ల్లో స్థలాలు కావాలని దరఖాస్తులైతే చేశారు. కానీ ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు పది శాతం డబ్బు చెల్లించేందుకు జనం ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
టీడీపీ హయాంలో హ్యాపీ నెస్ట్ పేరుతో…ప్రభుత్వం డబ్బులు సేకరించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును పక్కన పడేసింది. ధనికులు, ఎన్‌ఆర్‌ఐలు…డబ్బు చెల్లించారు కాబట్టి…పెద్ద ఇబ్బందులు ఎదురుకాలేదు. తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బును ప్రభుత్వ పరం చేయడానికి ఇష్టపడటం లేదు.