పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు. అదే తమిళ సినిమా వినోదయ సిత్తం తెలుగు రీమేక్.
గతంలో ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ ను కన్ ఫామ్ చేసాడు పవన్. ఇప్పుడు షూటింగ్ ప్రారంభించబోతున్నాడు.
ఓరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన సముద్రఖని తెలుగు వర్షన్ ను తెరకెక్కిస్తున్నాడు.
అందుకు సంబంధించిన స్క్రిప్ట్ ను, స్క్రీన్ ప్లేను త్రివిక్రమ్ అందించబోతున్నాడని సమాచారం.
ఇప్పటికే మార్పులు చేర్పులతో కూడిన స్కిప్ట్ ను అలాగే డైలాగ్ వర్షన్ ను త్రివిక్రమ్ స్వయంగా సముద్రఖని చేతుల్లో పెట్టాడని సమాచారం. గోపాల గోపాల లో శ్రీకృష్ణుడి పాత్ర చేసాడు పవన్. ఇప్పుడు ఇదే తరహా పాత్రను వినోదయ రీమేక్ లోనూ రిపీట్ చేయబోతున్నాడు పవన్. సాయి ధరమ్ తేజ్, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటించబోతున్నారు.
రికార్డ్ సమయంలో షూటింగ్ పూర్తి చేసి మూవీని మే లేదా జూన్ లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.
వినోయయ సిత్తం తెలుగు రీమేక్ కు తమన్ సంగీతం అందించబోతున్నాడు. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన మరో సగ భాగం షూటింగ్ కూడా పూర్తైంది. అయితే ఈ మూవీ మిగితా సగాన్ని పవన్ ఎప్పుడు పూర్తి చేయాలనుకుంటున్నది ఇంకా క్లారిటీ లేదు.