కేజీయఫ్ రిలీజ్ తర్వాత కన్నడ సినీ పరిశ్రమ పూర్తిగా మారిపోయింది. భారీ తనానికి మారుపేరుగా మారింది.
కేజీయఫ్ 2 వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు రాబట్టడం ఆ తర్వాత వచ్చిన విక్రాంత్ రోణ కూడా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడం కాంతార లాంటి సినిమా 400 కోట్లు రాబట్టం శాండల్ వుడ్ కాన్ఫిడెన్స్ ను అమాంతం పెంచేసింది.
అందుకే అక్కడి హీరోలు కేజీయఫ్ ఫార్మాట్ మూవీస్ కు జిందాబాద్ కొడుతున్నారు.
ఇప్పటికే కబ్జా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పుడు ధృవ్ సర్జా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ మార్టిన్ ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఈ సినిమా ట్రైలర్ లో కనిపించిన షార్ట్స్, మేకింగ్ వాల్యూస్, భారీ తనం, అంతా కూడా కేజీయఫ్ సిరీస్ ను గుర్తు చేస్తూ
అబ్బురపరుస్తోంది. పైగా కేజీయఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. ఏపీ అర్జున్ ఈ సినిమాను తెరకెక్కించాడు. త్వరలోనే చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ప్రకటించనుంది.