చెన్నై వేదికగా సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ జరిగింది.
ఇందులో భాగంగా భవిష్యత్ సినిమా ట్రెండ్ అనే టాపిక్ పై నిర్వహించిన చర్చా వేదికలో మణిరత్నం
ఎస్ఎస్ రాజమౌళి సుకుమార్ పాల్గొన్నారు. ఇదే వేదిక పై నుంచి రాజమౌళికి స్వయంగా ధన్యవాదాలు తెలిపాడు మణిరత్నం. ఇంతటి మహాదర్శకుడికి దర్శకధీరుడు చేసిన సాయం ఏమై ఉంటుంది అనుకుంటున్నారా.
బాహుబలి రెండు భాగాలుగా తీయడం. అప్పటికే 30 ఏళ్లుగా పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్ట్ ను ఎలా తీయాలా అని తలపట్టుకు కూర్చున్న మణిరత్నంకు బాహుబలి రెండు భాగాలుగా తీసి చరిత్ర సృష్టించడంతో
పొన్నియిన్ సెల్వన్ ను రెండు భాగాలుగా తెరకెక్కించే ధైర్యం అందివచ్చింది.
ఇదే విషయాన్ని మణిరత్నం ఎన్నో సార్లు చెప్పాడు. ఇప్పుడు రాజమౌళికి స్వయంగా చెప్పుకొచ్చాడు.
ఈ అభినందనలు చూసి రాజమౌళి ఉప్పొంగిపోయాడు. తన జీవితంలో ఇదే అత్యుత్తమ అభినందన అంటూ మురిసిపోయాడు. బాహుబలి ఫార్మాట్ లోనే తీసిన పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం
ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఏకంగా కోలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
దాదాపు 500 కోట్లు రాబట్టింది. ఏప్రిల్లో రెండో భాగం విడుదల కానుంది. పార్ట్ 2 రిలీజ్ పోస్ట్ పోన్ కానుందని రూమర్లు వచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని యూనిట్ చెప్పుకొచ్చింది.