ప్రస్తుతం గౌతమ్ మీనన్ యాక్టర్ గా బిజీగా ఉన్నాడు. కాని 7 ఏళ్ల క్రితం అతను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ఆ మాటకు వస్తే ఇప్పటికీ అతని టేకింగ్ లో సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తూ వస్తున్నాయి.
దర్శకుడిగా బిజీగా ఉన్న సమయంలో గౌతమ్ మీనన్ తెరకెక్కించిన చిత్రం ధృవ నక్షత్రం.
2016లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే బడ్జెట్ ఇష్యూస్ తో చాలా భాగం సినిమా షూటింగ్ పూర్తైనా
ఇన్నేళ్లు విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఎవరో నిర్మాత ముందుకొచ్చాడు.
వెంటనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెట్ చేసేందుకు హరీశ్ జయరాజ్ రంగంలోకి దిగాడు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నట్లు తెలిపాడు హరీశ్. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1లో విక్రమ్ నటనపై ప్రశంసలు కురవడం
ఏప్రిల్లో రెండో భాగం విడుదల ఉండటంతో ధృవనక్షత్రం సినిమాను రిలీజ్ చేసేందుకు ఇదే సరైన సమయం అనుంటున్నాడు గౌతమ్ మీనన్. పెళ్లి చూపులు ఫేమ్ రీతు వర్మ హీరోయిన్ గా నటించింది.
పొన్నియిన్ సెల్వన్ కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. దాంతో విక్రమ్ పా. రంజిత్ దర్శకత్వంలో తంగాలాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఇదే ఏడాది విడుదల కానుంది.