రాంగోపాల్‌వర్మ అంటే మెంటల్. పర్వర్టెడ్. ఆడోళ్లని చూస్తే సొల్లు కార్చుకుంటాడు. కాళ్ల వేళ్లని కూడా నాకేస్తాడు. పోర్న్ ఇండస్ట్రీలో ఉండాల్సినోడు పొరపాటున మన ఖర్మకొద్దీ సినీ పరిశ్రమలో ఉన్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ గురించి ఇప్పటిదాకా అందరికీ ఉన్న అభిప్రాయం ఇదే. కానీ ఆయన అదే టైప్ కాదు అదో టైపు. తనలోనూ భావోద్వేగాలు ఉన్నాయి. తను కూడా సామాజికబాధ్యత ఉన్న పౌరుడే. అందుకే హైదరాబాద్ మహానగరంలో పీక్కుతింటున్న కుక్కలగురించి ఏ సెలబ్రిటీ పట్టించుకోకపోయినా వర్మ ముందుకొచ్చాడు.
కుక్కల బెడద గురించి ఇప్పటిదాకా ఏ సెలబ్రిటీ అయినా మాట్లాడారా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో అదో సిల్లీ ఇష్యూ. కానీ అదెంత పెద్ద సమస్యో కుక్కలదాడిలో కొడుకుని పోగొట్టుకున్న కన్నవారికి తెలుసు. కాంట్రవర్సీకి గాడ్‌ఫాదర్‌లాంటి డైరెక్టర్ వర్మని కూడా ఈ సంఘటన కదిలించింది. మానవతా దృక్పథానికి మీనింగ్ తెలీదని కామెడీ చేసే వర్మని ఆ ఇన్సిడెంట్ మీడియా స్టూడియోకి రప్పించింది. అక్కడితోనే ఆగలేదు వర్మ. ట్వీట్లతో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఇంత జరిగినా సీరియస్‌గా తీసుకోని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని తన ట్వీట్లతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
బీఆర్ఎస్ నాయకులకు ఆ పార్టీ కార్పొరేటర్లకు ఆర్జీవీ టార్గెట్ అయ్యారు. అయినా ఆయన వెనక్కితగ్గలేదు. కుక్కల దాడిలో కొడుకుని కోల్పోయిన కుటుంబానికి అండగా నిలవాలని ట్విటర్‌లో పిలుపునిచ్చిన వర్మని చూసి ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు. ఆయనంటే అసహ్యించుకునేవాళ్లు కూడా సార్ సూపర్ అనేలా ఉంది వర్మ రియాక్షన్. ఆర్జీవీ కూడా మిగతా సెలబ్రిటీల్లా పడవల్లాంటి కార్లలో దూసుకుపోవచ్చు. కానీ ఓ సామాజిక సమస్యపై స్పందించిన తీరు వర్మమీద ఉన్న అభిప్రాయాన్ని మార్చేస్తోంది. తనలో కూడా మనం ఇప్పటిదాకా చూడని మంచి మనిషి ఉన్నాడు.