లైగర్ తర్వాత బాక్సాఫీస్ రేస్ లో పూర్తిగా వెనుక పడ్డాడు విజయ్ దేవరకొండ.
ఫ్యాన్స్ ను కూడా పూర్తిగా డిజప్పాయింట్ చేసాడు. ఈ దశలో వారిలో జోష్ తెచ్చేందుకు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్నాడు. ముందుగా ఖుషిని రిలీజ్ కు రెడీ చేయనున్నాడు. వచ్చే నెలలో సమంత రీఎంట్రీతో
ఫ్రెష్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత షూటింగ్ కంటిన్యూ గా జరగనుంది.
ఖుషి పూర్తైన తర్వాత గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో సినిమాను ప్రారంభించనున్నాడు విజయ్ దేవరకొండ.
ఈ సినిమాకు అనిరుథ్ సంగీతాన్ని అందించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగులో ఎన్టీఆర్ కొత్త సినిమాకు తప్పితే అనురుథ్ మరో తెలుగు చిత్రానికి సంగీతాన్ని అందించడం లేదు.
అందుకు ప్రత్యేకమైన రీజన్ అంటూ ఏం లేదు. తమిళంలో అనిరుథ్ చాలా బిజీగా ఉన్నాడు.
అన్ని కూడా డెడ్ లైన్ పై ఆధార పడిన సినిమాలు. ఈ దశలో తెలుగుసినిమాలకు ట్యూన్స్ అందించే సమయం అతనికి లేదు. అయితే జెర్సీ కోసం గౌతమ్, అనిరుథ్ కలసి పని చేయడంతో ఆ రిలేషన్ తో ఇప్పుడు విజయ్ దేవరకొండ మూవీకి కూడా మ్యూజిక్ అందించేందుకు అని ఒప్పుకున్నాడట. అనిరుథ్ సాంగ్స్ కు విజయ్ దేవరకొండ స్టెప్పులు
ఊహించుకుంటేనే రౌడీ ఫ్యాన్స్ కు భూమి మీద నిలవలేకపోతున్నారు.