గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో ధృవ -2 ఉంటుందని దర్శకుడు మోహన్ రాజా ప్రకటన చేసాడు.
ఇప్పుడు ఆ వైపుగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. తమిళంలో విడుదలై సూపర్ హిట్టైన తని ఓరువన్ మూవీని
తెలుగులో రామ్ చరణ్ నటించాడు. టాలీవుడ్ లో ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
చరణ్ నటనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తని ఓరువన్ లో జయం రవి హీరోగా నటించాడు.
ఇప్పుడు మోహన్ రాజా దర్శకత్వంలోనే తని ఓరువన్ సీక్వెల్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపాడు జయం రవి.
ఏడాది చివర్లో ఈ క్రేజీ సీక్వెల్ ను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయట. తమిళ వర్షన్ కు తన తమ్ముడితో తెరకెక్కించిన మోహన్ రాజా తెలుగు వర్షన్ కు రామ్ వర్షన్ తో తెరకెక్కిస్తాడోమో చూడాల్సి ఉంది. ఏడాది చివరి వరకు అంటే అప్పటికి
చరణ్ చేతిలో ఉన్న శంకర్ మూవీ షూట్ కంప్లీట్ అవుతుంది. బుచ్చిబాబుతో మూవీ ఆగస్ట్ నుంచి ప్రారంభిస్తాడు కాబట్టి
అప్పటికి సగం పూర్తి అవుతుంది. 2024లో ఈ చిత్రం ఒకే సారి తెలుగు, తమిళ భాషల్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.