టాలీవుడ్ యూత్ హీరోలు అందరూ, ఈ మధ్య కాలంలో పెళ్లికి తొందర పడుతున్నారు.
గత రెండేళ్ల కాలంలో ఆల్ మోస్ట్ యూత్ హీరోలందరూ పెళ్లి పీటలపై కనిపించారు.
రానా, నితిన్, నిఖిల్, నాగ శౌర్య,అందరికి అందరూ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నారు.
త్వరలో ఈ టీమ్ లోకి శర్వానంద్ కూడా చేరిపోనున్నాడు. ఆల్రెడీ అతనికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది.
ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా పెళ్లికి రెడీ అవుతున్నాడట. కొంతకాలంగా కథానాయిక లావణ్య తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు వరుణ్ తేజ్. వీరిద్దరు మిస్టర్ అంతరిక్షం సినిమాల్లో కలసి నటించారు.
మిస్టర్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని సమాచారం. దాదాపు 7 ఏళ్లుగా వీరిద్దరు లవ్ లో ఉన్నారు.
ఇంట్లో పెద్దలకు సైతం వీరి ప్రేమపై అభ్యంతరం లేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్ గాంఢీవధారి అర్జున అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజైన తర్వాత వరుణ్ పెళ్లి డేట్ ను ఎనౌన్స్ చేసే అవకాశం ఉందట.
మరో వైపు లావణ్య ఇటీవలే పులిమేక అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ఇప్పటికే అనేక సార్లు వరుణ్ పై తన ప్రేమను వ్యక్తపరిచింది లావణ్య. వరుణ్ మాత్రం చిన్న లీక్ కూడా ఇవ్వలేదు. బయటకూడా ఎక్కడా ఆమెతో కలసి కనిపించలేదు.