మోహన్‌బాబు ఇంట్లో శుభకార్యం పూర్తయింది. అక్కడ ఒక్కటైన జంట ఇద్దరికీ గతంలో పెళ్లిళ్లయ్యాయి పెటాకులయ్యాయి. ఇద్దరూ విడాకుల తర్వాత కొత్త జీవితంలో అడుగుపెట్టడం ఆసక్తికర ఘట్టం. మోహన్‌బాబు కుమారుడు మంచు మనోజ్ దివంగత భూమా నాగిరెడ్డి కూతురు మౌనికారెడ్డి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఎప్పట్నించో ఉన్న పరిచయాన్ని వివాహబంధంగా మార్చుకున్నారు. మౌనికాతో మనోజ్ పెళ్లి మోహన్‌బాబు దంపతులకు ఇష్టంలేదన్న ప్రచారం జరిగింది. కానీ ఫిల్మ్‌నగర్‌లోని మోహన్‌బాబు ఇంట్లోనే రెండు కుటుంబాల ముఖ్యుల మధ్య పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత ఇన్‌స్టాలో మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ అందరిలో ఆసక్తిరేపింది. మనోజ్ పెళ్లి జరగడానికి మంచు కుటుంబంనుంచి చొరవ చూపింది అతని అక్క లక్ష్మినే అన్న విషయం ఆ పోస్ట్‌తో అందరికీ అర్ధమైంది అక్కా ఏ జన్మ పుణ్యమో నాది. లవ్ యు అక్కా అండ్ థాంక్యూ ఫర్ ఎవ్విరిథింగ్ అంటూ ఎమోషనల్ పోస్టు షేర్ చేశాడు మంచు మనోజ్.
దగ్గరుండి పెళ్లి జరిపించినందుకు సోషల్‌మీడియాలో అక్కకు మనోజ్ హృదయపూర్వకంగా థాంక్స్ చెప్పాడు.
మంచు మనోజ్ పోస్టులో తల్లిదండ్రులు అన్న ప్రస్తావనలేదు కేవలం అక్క గురించే. అంటే ఇంట్లోని వాళ్లకు ఇష్టంలేకపోయినా మంచు లక్ష్మినే అందరినీ ఒప్పించి ఉండాలి. వ్యతిరేకించినా వారిద్దరి పెళ్లి ఆగదని నచ్చజెప్పి ఉండాలి. మంచు ఇంట్లో లక్ష్మి మోనార్క్ అన్న విషయం ఓపెన్ సీక్రెట్. దాంతో కుటుంబమంతా మంచు లక్ష్మి ఒత్తిడికి తలొగ్గి ఉంటుందని భావిస్తున్నారు. అంతా పెళ్లి వేడుకకి హాజరై మనోజ్ విషయంలో ఎవరం వ్యతిరేకంగా లేమని చెప్పేందుకు ప్రయత్నించారు. విష్ణుతో కన్నా మనోజ్‌తోనే బాగా కలిసిపోతామని తామిద్దరం ఫ్రెండ్స్‌లా ఉంటామని గతంలో చాలాసార్లు చెప్పింది మోహన్‌బాబు కూతురు. ఆ ప్రేమతోనే తమ్ముడికోసం తానే పెళ్లి పెద్దయింది. మామగారు రాలేరనుకున్న మౌనికారెడ్డి కూడా పెళ్లి మండపంలో మోహన్‌బాబును చూసి ఎమోషనల్ అయింది.