వంశీ పైడిపల్లితో తమిళ హీరో విజయ్ వారసుడు సినిమా చేస్తే ఆ మూవీ వరల్డ్ వైడ్ గా 300 కోట్లు కొల్లగొట్టింది.
వెంకీ అట్లూరితో ధనుష్ సార్ మూవీ చేస్తే ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లను రాబట్టంది.
ఈ లెక్కలు తమిళ హీరోల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. అందుకే కోలీవుడ్ హీరోలు ఇప్పుడు తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. సూర్య కూడా త్వరలో తెలుగు చిత్రం చేయబోతున్నాడు.
అందుకు సీతారామం దర్శకుడు హను రాఘవపూడిని ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సూర్య కోసం హను పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసాడట. పైగా ఈ డెడ్లీ కాంబినేషన్ లోమూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందట. అయితే ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు లేవు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో సూర్య భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సూర్య ఇంకా చాలాచిత్రాల్లో నటించాల్సి ఉంది.
అందులో వెట్రీ మారన్ మూవీ ఒకటి. సుధ కొంగర దర్శకత్వంలో మరో చిత్రం చేయాల్సి ఉంది.
ఈ చిత్రాలు పూర్తైన తర్వాత హనుతో సూర్య సినిమా చేస్తాడు అనుకుంట.