నాగార్జునకు ఈ మధ్య కాలంలో సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తోంది.
ఒక సంక్రాంతి పండక్కి వచ్చి సోగ్గాడే చిన్న నాయనా చిత్రంతో కెరీర్ లోనే బిగ్ హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత మరో సంక్రాంతి సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ అయిన బంగార్రాజును రిలీజ్ చేసి
మరోసారి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను మరోసారి రిపీట్ చేస్తున్నాడు.
ధమాకా మూవీ రైటర్ ప్రసన్నకుమార్ ను దర్శకుడిగా ప్రమోట్ చేస్తూ తాను హీరోగా నటించే కామెడీ మూవీని
వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. వచ్చే ఉగాది పండక్కి సినిమాకు సంబంధించిన టైటిల్ ను రివీల్ చేయబోతున్నారట. సంక్రాంతి పండక్కి ఒకవైపు ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె రిలీజ్ అవుతోంది.
మరో వైపు రామ్ చరణ్ కొత్త సినిమా విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది.
వీటిల్లో ప్రాజెక్ట్ కె సంక్రాంతి బరి నుంచి తప్పుకుని రిపబ్లిక్ డే వీకెండ్ కు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయట.
అందుకే ప్రభాస్ ప్లేస్ లో తాను వస్తానంటున్నాడు కింగ్