తెలంగాణ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. పార్లమెంట్‌లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌తో జంతర్‌మంతర్‌లో దీక్షకు సిద్ధమయ్యారు కల్వకుంట్ల కవిత. కవిత దీక్షకంటే మర్నాడు జరగబోయే ఈడీ విచారణ గురించే అందరి ఉత్కంఠ. జంతర్‌మంతర్‌లో దీక్షకోసం కవిత అనుమతికోరగానే అదేచోట లిక్కర్‌స్కామ్‌పై దీక్షకు సిద్ధమైంది బీజేపీ. దీంతో సగం గ్రౌండ్‌తో సర్దుకోమని పోలీసులు సూచించినా కవిత బృందం కుదరదని చెప్పేసింది. దీంతో కవిత దీక్ష చేస్తున్న సమయంలోనే ఆమె నిందితురాలిగా ఉన్న లిక్కర్ స్కామ్‌పై ఢిల్లీలోనే మరోచోట దీక్షకు దిగుతోంది బీజేపీ.
కేసీఆర్ ఫోన్‌లో కూతురికి భరోసా ఇస్తే ఒకరోజు ఆలస్యంగా మీడియా ముందుకొచ్చిన అన్న కేటీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేసుకున్నారు. కవిత దీక్షకు మద్దతుగా ఆయన కూడా ఢిల్లీ వెళ్తున్నారు. మహిళా మంత్రులతో పాటు భారీగా జాగృతి కార్యకర్తలు ఢిల్లీలోనే ఉన్నారు. అటు ఢిల్లీలో దీక్షకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలుచేశారు కేసీఆర్ కూతురు. సీతారాం ఏచూరితో పాటు కొందరు ప్రముఖులను కలుసుకున్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసీఆర్ కూతురిని లిక్కర్ కేసులో ఇరికించారనే ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది బీఆర్‌ఎస్. అందుకే దీక్షకు భారీ ఏర్పాట్లు చేసింది.
విచారణను ఎదుర్కునే దమ్ము ధైర్యం తమకు ఉందని హైదరాబాద్‌లో కేటీఆర్ ఢిల్లీలో కవిత ప్రెస్‌మీట్లు పెట్టి మరీ చెప్పటంతో విచారణలో ఏం జరిగినా సిద్ధపడినట్లే కనిపిస్తోంది. దీక్ష చేసిన మర్నాడే ఈడీ విచారించి అరెస్ట్‌చేస్తే రాజకీయ వేడి తగ్గకుండా చూసుకోబోతోంది. పార్టీపరంగా అంతా కవితకు మద్దతుగా నిలిచినా ప్రజల్లో స్పందన లేకపోవడం బీఆర్‌ఎస్‌ని కలవరపరుస్తున్న విషయం. తెలంగాణ సమాజం తలవంచదు అని కవిత ట్వీట్ చేసినా ఆమెపై కేసు తెలంగాణపై దాడిగా అధికారపార్టీ చెబుతున్నా ప్రజలు దీన్ని అంగీకరించడంలేదు. వ్యక్తిగత లావాదేవీలతో కేసులో ఇరుక్కుని తెలంగాణ సమాజ సమస్యగానో తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంగానో చెప్పటాన్ని ఎవరూ హర్షించటం లేదు. గతంలో పరిస్థితులు వేరు. ప్రత్యేకరాష్ట్ర సాధనకోసం భావోద్వేగాలు పెల్లుబికాయి. ఇప్పుడు పరిస్థితులు అలా లేవన్నది కేసీఆర్ కుటుంబానికి కూడా అర్ధమవుతున్నట్లే ఉంది.