పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప-2 ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాతో వెయ్యి కోట్లను టార్గెట్ చేసాడు బన్ని. అందుకే ఆ తర్వాత చేయబోయే సినిమా
అంతకు మించి కలెక్ట్ చేయాలని లక్ష్యంగా పెటుకున్నాడు.
అందుకోసం సందీప్ వంగాతో మూవీ ని ఫిక్స్ చేసుకున్నాడు.
ఈ మూవీని టీసిరీస్ సంస్థ నిర్మిస్తోంది. బన్నితో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం
టీసిరీస్ దాదాపు 120 కోట్ల పారితోషికం అందించేందుకు ముందుకొచ్చిందట.
ప్రస్తుతం ఈ రెమ్యూనరేషన్ ఇష్యూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
తెలుగులో ప్రభాస్, రామ్ చరణ్, చిరు, మహేష్, పవన్, ఎన్టీఆర్ తో సమానంగా
ఇప్పటి వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు అల్లు అర్జున్.
ఇప్పుడు సందీప్ వంగాతో మూవీ కోసం తెలుగు హీరోలందరిని దాటి రెమ్యూనరేషన్ హైక్ చేయడం
అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొన్నేళ్లుగా వరుస బ్లాక్ బస్టర్లు
విపరీతంగా పెరిగిన థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ బన్నిని మోస్ట్ వాంటెడ్ స్టార్ గా మార్చాయి.