పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో ఫైటర్ అనే మూవీ తీస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత అతని ఫోకస్ ప్రభాస్ తో తెరకెక్కించాల్సిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై ఉంది.
పఠాన్ లో షారుఖ్ ను ఏ విధంగా అయితే హై వోల్టేజ్ యాక్షన్ మూవీలో చూపించాడో
అదే విధంగా ప్రభాస్ ను చూపించాలనుకుంటున్నాడు. ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా స్టార్ డమ్
సినిమాకు పఠాన్ ను మించి వసూళ్లను నమ్ముతున్నాడు. అందుకోసం మ్యాగ్జిమమ్ బడ్జెట్ కావాలంటున్నాడు.
దాంతో బాలీవుడ్ లో నెం.1 ప్రొడక్షన్ హౌస్ అదే విధంగా మైత్రీ మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్
సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయట. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమాను
2025లో పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ కు జోడిగా కృతి సనన్ నటించే ఛాన్సెస్ ఉన్నాయి.
వీరిద్దరు ఇప్పటికే ఆదిపురుష్ లో నటించి ఉన్నారు. ప్రభాస్ యాక్షన్ మూవీలో నటిస్తే చూడాలని
టోటల్ ఇండియా ఆశక్తిగా ఎదురు చూస్తోంది. అట్టర్ ఫ్లాప్ మూవీ సాహో 400 కోట్లు రాబట్టింది.
ఇక హిట్ టాక్ వస్తే ఈజీగా 1000 కోట్లకు పైగా వసూళ్లను అందుకోవడం ఖాయం.
ఆ ధైర్యంతోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించాలనుకుంటున్నారు సిద్ధార్థ్ ఆనంద్.