టాలీవుడ్ హాట్ పెయిర్,హిట్ పెయిర్ విజయ్ దేవరకొండ రష్మిక విడిపోయారని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
గీత గోవిందం షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి నిండా ప్రేమలో మునిగితేలుతున్నారు.
ఈ మధ్యే ఇద్దరూ కలసి మాల్దివులకు వెళ్లి వచ్చారు. అంతా బాగానే ఉంది రేపో మాపో తమ రిలేషన్ ను అఫీసియల్ చేస్తారు అనుకుంటుడగా ఇప్పుడు వీరిద్దరు బ్రేకప్ బోర్డ్ పెట్టారట. అందుకు కారణం రష్మిక అనే తెలుస్తోంది.
కొంత కాలంగా రష్మిక వ్యవహరిస్తున్న తీరు విజయ్ కు నచ్చడంలేదట. ఆ విషయాన్ని డీప్ గా డిస్కస్ చేసేందుకు
వీరిద్దరు మాల్దీవులకు వెళ్లారట. అయినప్పటికీ సమస్య అలాగే ఉండటంతో రష్మికకు రౌడీ గుడ్ బై చెప్పకతప్పలేదట.
నిజానికి వీరిద్దరు మరోసారి కలసి నటిస్తారని ప్రచారం సాగింది. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ రాసుకున్న లవ్ స్టోరీ ఈ హిట్ పెయిర్ మరోసారి రిపీట్ అవుతారని ప్రచారం సాగుతున్న వేళ ఇలా బ్రేకప్ బోర్డ్ పెడతారని ఎవరూ ఊహించరు.
అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది క్లారిటీ రావాల్సి ఉంది. బాలీవుడ్ లో పుట్టుకొచ్చే ప్రతీ రూమర్ నిజం కాదు.
అదే జరగాలని వీరిద్దరు విడిపోకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.