ఒకే ఒక జీవితం సినిమా రిలీజ్ తర్వాత శర్వానంద్ లో అనుహ్య మార్పు వచ్చింది.
అప్పటి వరకు ప్రయోగాలు చేస్తూ వెళ్లిన హీరో ఇప్పుడు రొమాంటిక్ కామెడీ సబ్జెక్ట్స్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
యువ హీరోలందరూ మాస్ జపం చేస్తూ గడ్డం పెంచుకుంటూ ధూమ్ ధామ్ లాంటి సాంగ్స్ చేస్తుంటే
హీరో శర్వానంద్ మాత్రం ప్రేమకథలు చేసేందుకు ఇస్టపడుతున్నాడు.
అయితే అందుకోసం ఫ్లాప్స్ లో ఉన్న దర్శకులను పిలిచి మరి కొత్త సినిమాలు ఇస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. భలే మంచి రోజు, శమంతకమణి, హీరో చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఇప్పటికే
ఒక చిత్రం చేస్తున్నాడు శర్వా. ఇప్పుడు తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందించిన ఎక్స్ ప్రెస్ రాజా డైరెక్టర్ మేర్లపాక గాంధీతో మూవీ చేయబోతున్నాడట. మేర్లపాక గాంధీ ఈ మధ్య వరుస ఫ్లాప్స్ తో బాక్సాఫీస్ రేస్ లో పూర్తిగా వెనుక పడ్డాడు.
ఇప్పుడు ఆ దర్శకుడిని పిలిచి సినిమా చేయబోతున్నాడు. పైగా ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోంది.
శర్వానంద్ ఇలా వరుస పెట్టి ఫ్లాప్స్ లో ఉన్న దర్శకులకు సినిమాలు అందించడం ఆయన ఫ్యాన్స్ కు ఏ మాత్రం నచ్చడం లేదు.