అన్నను మించిన చెల్లి-ప్రత్యర్ధులకు దడ పుటిస్తున్న కింగ్ సిస్టర్

By KTV Telugu On 1 September, 2022
image

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ని యంత. ఎవరి మాట వినడు. తాను చేయాలనుకున్నది చేస తీరుతాడు. అణు పరీక్షలు నిర్వహించి అగ్రరాజ్యం అమెరికా వెన్నులోనే వణుకు పుట్టించిన నాయకుడు. ఇపుడు ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది సోదరి కిమ్ యో జంగ్. హద్దు దాటి ప్రవర్తిస్తే ఎవరినైనా వదిలి పెట్టేదే లేదంటూ హెచ్చరిస్తోంది. కిమ్ ని నియంత అన్న వారంతా ఆయన సోదరిని నియంతలకే నియంత అంటున్నారు.

కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అన్నయ్యను మించి డిక్టేటర్ లా వ్యవహరిస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ నియంత అయితే అతని కంటే పవర్ ఫుల్‌ యో జోంగ్.  కిమ్ యో జాంగ్‌కు కీలక పదవి కట్టబెట్టడంతో ఇక ఆమె మార్క్ పాలన చూపిస్తోంది. నార్త్ కొరియాలో పొలిట్ బ్యూరో సభ్యురాలిగా, అధ్యక్షుడి అడ్వైజరీగా కిమ్ యో జోంగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. కిమ్ యో జోంగ్ కు సహాయం చేసేందుకు మరో ఏడుగురిని కూడా అధ్యక్షుడు కిమ్ నియమించారు. ఈ కమిటీలో ఏకైక మహిళగా కిమ్ యో జోంగ్ మాత్రమే ఉన్నారు. ఉన్ అనారోగ్యంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన తర్వాత…ప్రత్యర్థులకు వణుకు పుట్టించేలా వ్యవహరిస్తోంది. దేశ రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటూ అగ్రరాజ్యానికి వార్నింగ్ ఇచ్చి అన్న తగ్గ వారసురాలిగా పేరు సంపాదించుకుంది. సోదరి దూకుడుకు మంత్రముగ్దుడైన ఉన్స్టే ట్ అఫైర్స్ కమిషన్ లో స్థానం కల్పించారు. దేశానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకుకోవాలన్నా స్టేట్ అఫైర్స్ కమిటీ ఆమోదం ఉండాల్సిందే.

కిమ్ జోంగ్ ఉన్ అకస్మాత్తుగా మరణిస్తే అతని వారసత్వాన్ని కిమ్ యో జోంగ్ కొనసాగిస్తారని ఉత్తర కొరియా పరిశీలకులు చెబుతున్నారు. ఉన్ పిల్లలకు 18 ఏళ్లలోపే వయసు ఉండటంతో యో జోంగ్ ఉత్తర కొరియా బాధ్యతలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ తో పాటు సింగపూర్, వియత్నాం పర్యటనలకు వెళ్లి తర్వాత అధ్యక్షురాలు తానేనన్న సంకేతాలు ఇచ్చింది. 2021 ఆగష్టులో జరిగిన అమెరికా, ఉత్తర కొరియా సైనిక విన్యాసాల్లో హాట్ కామెంట్స్ చేసింది. అధికారం కోసం అధికారం సుహృద్భావానికి సుహృద్భావం అనే సూత్రంతో అమెరికాతో పనిచేస్తామని హెచ్చరించింది. సోదరుడిగా దూకుడుగా వ్యవహరిస్తున్న యో జోంగ్త న వ్యక్తిగత విషయాలను బయటకు రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. పెళ్లి, పిల్లల గురించి ఏ విషయాన్ని బహిర్గతం చేయకుండా రహస్యంగా ఉంచుతోంది.

2021 నుంచి ఉత్తరకొరియాకు సంబంధించిన మూడు ప్రధాన సమావేశాల్లో ఆమె సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు కిమ్ యో జోంగ్. 2018 నుంచి అమెరికా, దక్షిణ కొరియా అణు చర్చల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ తోభేటీకి కిమ్ జోంగ్ ఉన్ తో పాటు ఆమె కూడా అటెండయ్యారు. అన్న ఉన్ లాగే సంచలన ప్రకటనలు చేస్తూ ప్రపంచ దేశాల దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది. ముఖ్యంగా బైడెన్ పరిపాలన పై కామెంట్స్ చేయడం, ఉత్తరకొరియా చేస్తున్న క్షిపణి ప్రయోగాలను సమర్థించుకోవడం, అదే సమయంలో ఇతర దేశాలతో సత్సంబంధాలపైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఉత్తర కొరియాలోని ఏ లక్ష్యాన్ని అయినా ఖచ్చితంగా ఛేదించగల సామర్థ్యాన్ని తమ సైన్యం క్షిపణులకు ఉందంటూ దక్షిణ కొరియా రక్షణ మంత్రి షూ వూక్ప రోక్షంగా ఉత్తర కొరియాను హెచ్చరించారు. తమ దేశంపై ఆర్మీ దాడికి ప్ర‌య‌త్నిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వార్నింగ్ ఇచ్చింది యో జోంగ్. అణుబాంబుతో దక్షిణ కొరియాపై దాడి చేయడానికి వెనుకాడేది లేదని ఆ దేశ ఆర్మీని అణ్వాయుధాల‌తో నామ రూపాల్లేకుండా చేస్తామ‌ని కిమ్ యో జోంగ్ హెచ్చరించింది. ద‌క్షిణ కొరియా అదే సాహ‌సం చేస్తే అదో పెద్ద త‌ప్పు అవుందంటూ హాట్ కామెంట్స్ చేసింది.  ఒకవేళ దక్షిణ కొరియా సైనిక చ‌ర్య‌కు పాల్పడితే అప్పుడు త‌మ న్యూక్లియ‌ర్ ద‌ళం ఆ దేశాన్ని సర్వ నాశనం చేస్తుందంటూ కౌంటర్ ఇచ్చింది.