దేశంలో మహిళా జనాభా ఎందుకు పెరుగుతుంది?

By KTV Telugu On 5 September, 2022
image

కంటే కొడుకునే కనాలన్న కోరిక తల్లిదండ్రుల్లో రోజురోజుకు తగ్గుతోందా. దేశంలో పురుషుల కంటే మహిళల సంఖ్య పెరుగుతూ అది స్థిరపడే సమయం వచ్చిందా. దీనిపై గణాంకాల్లో ఉన్న హెచ్చుతగ్గులేమిటి.. ప్రభుత్వం నుంచి వస్తున్న సమాధానం ఏమిటి.?

భారత దేశంలో లింగ నిష్పత్తి మారుతోంది. గతంలో మహిళల కంటే పురుషులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయి.. మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంచనాల ప్రకారం దేశంలో ఇప్పుడు ప్రతీ వేయి మంది పురుషులకు 1020 మంది మహిళలున్నారు. మహిళల జనాభాలో కేరళ నెంబర్ వన్ గా ఉంది. మళయాల రాష్ట్రంలో ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1145 మంది మహిళలున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆ సంఖ్య 1045 గానూ, తెలంగాణలో 1049గాను ఉంది. ల‌ద్దాక్  జననాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1104 మంది మహిళలు ఉన్న‌ట్టు సర్వే తెలిపింది. హరియాణాలో ప్రతీ వెయ్యి మంది పురుషులకు 926 మంది మహిళలే ఉన్నారు.

ఇప్పుడున్న లింగ నిష్పత్తి 2036 నాటికి స్థిరపడిపోయే అవకాశం ఉందని జాతీయ జనాభా కమిషన్ ఇటీవలే నిగ్గుతేల్చింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కంటీ ఈ సర్వేకు ఎక్కువ విశ్వసనీయత ఉందని భావిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా భ్రూణ హత్యలను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు ఫలించి ఇప్పుడు బాలికల జనాభా క్రమేణా  పెరుగుతోంది. ప్రస్తుతం వెయ్యికి 40 ఉన్న గర్భస్త శిశు మరణాలు..2036 నాటికి 30కి దిగువకు వస్తాయని అంచనా వేస్తున్నారు. లింగ నిర్ధారణ  పరీక్షలపై ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడంతో చాలా వరకు ప్రయోజనం కలిగింది. అయితే ఆందోళన చెందాల్సిన అంశం మరోటి ఉంది. 2036 నాటికి దేశ జనాభా 150 కోట్లు దాటుతున్నప్పటికీ.. అందులో యువత మాత్రం 22 కోట్లే ఉంటారన్నది ఆందోళన కలిగించే అంశమే. దేశం అభివృద్ధి చెందాలంటే యువకులే ఎక్కువగా ఉండాలి. 15 నుంచి 24 వయసు వారిని ప్రభుత్వం యువకులుగా పరిగణిస్తుంది.అంటే 2036 నాటికి దేశ జనాభాలో 15 శాతం మంది మాత్రమే యువకులు ఉంటారు.

ఒకప్పుడు దేశంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. ఆడపిల్ల పుడితే అశుభమని, పెళ్లి చేయడం కష్టమని భావించేవారు. అందులో గర్భస్త శిశు హత్యలకు దిగేవారు. అబ్బాయి పుడితే.. తమకు అండగా ఉంటాడని, అన్ని ఉత్తర కార్యాలు నిర్వహించి  తమను పున్నామ నరకం నుంచి బయట పడేస్తాడని నమ్మేవారు. ఇప్పుడు సామాజిక మార్పు వల్ల అటువంటి ఆలోచన నుంచి తల్లిదండ్రులు దూరంగా జరిగారు. పైగా మహిళలకు విద్యావశాలు పెరిగాయి. వాళ్లు బాగా చదువుకుని ఐఎఎస్, ఐపీఎస్, సీఏ సహా పలు పెద్ద ఉద్యోగాలను సునాయాసంగా పొందుతున్నారు. దానితో ఆడపిల్ల పుడితే తప్పేమిటన్న భావన పెరుగుతోంది. ఇప్పుడు ఆడ శిశు జననాల నుంచి విముక్తి పొందేందుకు అబార్షన్ చేయించాలన్న కోరిక కూడా  పోయింది. మహిళల ఆయుర్దాయం కూడా పెరగింది. దేశంలో పురుషుల సగటు ఆయుర్దాయం 67 సంవత్సరాలు ఉంటే. స్త్రీల సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలుగా ఉంది. అందుకే అనేక రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా కనిపిస్తోంది.