అంధకారం అస్తమిస్తుంది సూర్యుడు ఉదయిస్తాడు కమలం వికసిస్తుంది భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం రోజున అటల్ బిహారీ వాజ్ పేయి కామెంట్ చేశారు. నిజానికి అప్పుడు వారు సొంత పార్టీ పెట్టలేదు జనసంఘ్‌నే భారతీయ జనతా పార్టీగా మారాచారు. దేశ విభజన భారత స్వాతంత్య్రం పొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హవా కనిపించింది. దాని పునాదుల నుంచి అనేక కుల కుటుంబ ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయ పార్టీ అవసరమని అప్పటి పరిస్థితుల ప్రభావంతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భావించారు. ముఖర్జీ కూడా కాంగ్రెస్ కీలకనేత. హిందూత్వ వాదం ఆరెస్సెస్ ప్రోద్భలంతో 1952వ సంవత్సరంలో ముఖర్జీ సారథ్యంలో జనసంఘ్ ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ద్వారా ప్రభావితులైన జాతీయ వాదులంతా జనసంఘ్ లో చేరారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణం తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్ కు నాయకత్వం వహించారు.
1952లో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో జనసంఘ్ 3 సీట్లు సాధించింది. ఇక 1971 ఎన్నికల నాటికి 22 లోక్ సభ సీట్లతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయ పార్టీగా ఎదిగింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడంతో ప్రతి పక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు జనతా పార్టీలో జనసంఘ్ విలీనమైంది. జనతా పార్టీ 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. జనతా పార్టీ తరుఫున ఎక్కువ మంది జనసంఘీయులే గెలిచారు. అయితే పార్టీలోని నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. జనతా పార్టీలోని ఇతర నేతలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో అనుబంధం తెంచుకోవాలని జన సంఘ్ నేతలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో జనసంఘ్ నాయకులందరూ కలిసి జనతా పార్టీని వీడి కొత్త పార్టీని ప్రారంభించారు అలా 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటైంది అంటే ఒంటరిగా ఎదుర్కోలేకపోయింది. ఇతర పార్టీలతో కలిసిపోయి మళ్లీ జనసంఘ్ గానే ఏర్పడలేక భారతీయ జనతా పార్టీగా తెరపైకి వచ్చింది.
హిందూ రాజకీయాలకు అయోధ్య ఎంత ముఖ్యమో కశ్మీర్ కూడా అంతే ముఖ్యం. ఈ రెండు చక్రాలపై జనసంఘ్ రాజకీయ బండి కదులింది. కశ్మీర్‌లో 370వ రాజ్యాంగ అధికరణను మోదీ రద్దు చేశారు. 370 రద్దు ఇటీవలి రెండుమూడు దశాబ్దల డిమాండ్ కాదు. దానికి 70 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉంది సంఘ్ నేతలు దానికి కోసం తీవ్రంగా పోరాడారు. వారిలో శ్యామాప్రసాద్ ముఖర్జీ ముందు వరుసలో ఉంటారు. ఆయన కలను మోదీ నెరవేర్చారని అదే అసలైన నివాళి అని కాషాయ శిబిరం అప్పట్లో సంబరాలు చేసుకుంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు. బెంగాల్‌లో కులీల కుటుంబంలో జన్మించారు నేటి బీజేపీకి మూలపురుషుడు ఆయన. వెనకంజ వేయని జాతీయవాది అఖండ భారత్ ఆయన స్వప్నం. అందుకే భారతావనికి తలమానికమైన కశ్మీర్ విషయంలో ఆయన చాలా పట్టుదలగా ఉండేవారు 370ని తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లింలపై కాంగ్రెస్ మెతక బుజ్జిగింపు ధోరణిని విమర్శించేవారు.
జనసంఘ్ కశ్మీర్‌ను భౌగోళికంగానే కాకుండా సాంస్కృతికండా రాజకీయంగానూ భారత్‌లో ఏకం చేయడానికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రచారంతో ప్రయత్నాలు చేసింది. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు రెండు జెండాలు చెల్లవు అని తిరగబడింది. నెహ్రూ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తరచూ కశ్మీర్ విషయంలో అసమ్మతి వెళ్లగక్కేవారు. 370 ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 1949లో కాంగ్రెస్ పార్టీని మంత్రిపదవిని వదిలేశారు. 1951లో గోల్వార్కర్ సూచనలతో భారతీయ జనసంఘ్ స్థాపించి జాతీయవాదాన్ని ప్రచారం చేయడానికి నడుం బిగించారు. దేశంలో హిందువులకు ముస్లింకు ఒకే పౌరస్మృతి ఉండాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ నిరాహార దీక్ష చేయడానికి 1953 మే 11న కశ్మీర్ గడ్డపై అడుగుపెట్టారు. కశ్మీర్‌ను భారత్‌లో సంపూర్ణంగా విలీనం చేయాలని నినదించారు. ఆయనను పోలీసులు సరిహద్దులోనే అరెస్టు చేశారు. అదే ఏడాది జూన్ 23న ఆయన 52 ఏళ్ల వయసులో పోలీసు కస్టడీలోనే తుదిశ్వాస విడిచారు. కస్టడీలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు ఆనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కశ్మీర్ వెళ్లిన అటల్ బిహారీ వాజ్‌పేయి. ఆయన మృతి తరవాత జనసంఘ్‌ను నడిపించే నేత అయ్యారు.
స్వతంత్ర భారత దేశంలో జరిగిన రెండు అతిపెద్ద ప్రజా ఉద్యమాల్లో మొదటిది ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం ఒకటి. ఈ పోరాటంలో జనసంఘ్ నేతలు కీలకం ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జయప్రకాశ్ నారాయణ్ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) గురించి ఇప్పటి తరాలకు పెద్దగా తెలియకపోవచ్చు. నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం సాగించిన ప్రజాస్వామ్య హననం అంతా ఇంతా కాదు. ఆ నిరంకుశత్వంపై ప్రజాస్వామ్యవాదులు పోరాడి ఘన విజయం సాధించారు. ఇందిరను గద్దె దింపడంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఆనాటి జనసంఘ్ నేతలు కీలక పాత్ర పోషించారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ జెపి నేతృత్వంలో ప్రారంభమైన ఈ ఉద్యమంలోకి అప్పటి జనసంఘ్ నేతలు చేరారు. జెపి నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన జనతా పార్టీలో చేరిన అప్పటి జనసంఘ్ లోని ఆర్ఎస్ఎస్ సభ్యులు చేరారు. అలాంటి వాగ్దానాలు చేసిన వారిలో ప్రముఖులు ఎ.బి. వాజ్‌పేయి ఎల్.కె. అద్వానీ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ బాలా సాహెబ్ దేవరాస్ ఉన్నారు. జెపి వారి మాటలను విశ్వసించారు. వారు తమ ఆర్ఎస్ఎస్ అనుబంధాన్ని సభ్యత్వాన్ని ఎన్నడూ వదులుకోలేదు. ఇది అనేక విబేధాలకు కారణమై వారు జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేయడానికి ఆరెస్సెస్ ఆ పార్టీ సిద్ధాంత కర్తగా పయనం సాగుతోంది. ఎవరూ ఉహించని విధంగా ఎదుగుతోంది. మోదీ ప్రధాని అయ్యాక ఆరెస్సెస్ పాత్ర తగ్గిపోతోందన్న ప్రచారం జరుగుతోంది.