హిందీని అన్నిచోట్లా రుద్దాలన్నది కేంద్రం టార్గెట్. దక్షిణాది అధికారులు నేతలకు ఢిల్లీలో ఈ భాష విషయంలోనే కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. ఎవరి సంస్కృతి వారికి గొప్ప ఎవరి భాషంటే వారికి అభిమానం పుట్టి పెరిగినప్పటినుంచీ ఏ వాతావరణంలో ఉంటామో అక్కడి భాషనే నేర్చుకుంటాం అందులోనే బతుకుతుంటాం. కానీ కేంద్రంలో ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక హిందీని బలవంతంగానైనా జొప్పించాలన్న ప్రయత్నమైతే నిరంతరం సాగుతూనే ఉంది. కర్నాటక ఎన్నికలు వచ్చేసరికి బీజేపీకి ప్రాంతీయ భాషలపై ప్రేమ పుట్టుకొచ్చింది. గత ప్రభుత్వాలు ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం లేకుండా చేశాయని ప్రధాని మోడీ బాధపడటం హిందీ రుద్దే ప్రయత్నాలనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రాంతీయభాషను అమితంగా ప్రేమించే తమిళనాడు కర్నాటకల్లో హిందీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. తమిళనాడు ప్రభుత్వమైతే అధికారికంగానే దీనిపై స్పందించింది. అయినా కేంద్రం తన ప్రయత్నాలు మానటం లేదు. ఇప్పుడు కేంద్రంతో తమిళనాడుకు పెరుగు వివాదం మొదలైంది. రాష్ట్రంలో చడీచప్పుడు కాకుండా పెరుగు పేరుని మార్చేయడమే దీనికి కారణం. భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ తమిళనాడు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్‌కి పెరుగు పేరు మీద కొన్ని ఆదేశాలిచ్చింది. పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లీషులో ఉండే కర్డ్ తమిళంలో ఉన్న తయిర్ పేర్లను తొలగించి దహీ అని హిందీలోకి మార్చాలని హుకుం జారీచేసింది. పెరుగుతో పాటు నెయ్యి చీజ్ వంటి డెయిరీ ఉత్పత్తుల పేర్లను కూడా ఇలాగే మార్చాలన్నది FSSAI ఆదేశం. తమిళనాడు పొరుగునున్న బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకకు కూడా ఇలాంటి ఉత్తర్వులే అందాయి.
పెరుగు ప్యాకెట్లపై ఉన్న ఇంగ్లీష్ ప్రాంతీయ భాషల పేర్లకు హిందీ కూడా జోడిస్తే పెద్ద అభ్యంతరం ఉండేది కాదేమో. కానీ రెండూ తీసేసి కేవలం హిందీలోనే ఇవ్వాలనటంతో తమిళనాడు కన్నెర్ర చేసింది. పాల ఉత్పత్తిదారులు ఈ ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తన సహజ శైలిలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. హిందీని బలవంతంగా రుద్దేందుకు చివరికి పెరుగు ప్యాకెట్‌పై ప్రాంతీయ భాషలో ఉన్న పేరును కూడా సహించలేకపోవడం దారుణమంటూ ధ్వజమెత్తారు స్టాలిన్. ఈ పోకడలకు పోతున్నవారిని దక్షిణాది శాశ్వతంగా బహిష్కరిస్తుందని హెచ్చరించారు. చివరికి బీజేపీ తమిళనాడు చీఫ్ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం విశేషం.
దహీ పదాన్ని ఉపయోగించే ప్రసక్తే లేదని తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సమాఖ్య తేల్చిచెప్పేసింది. తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావటంతో తన ఆదేశాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ వెనక్కి తగ్గింది. పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లీష్ పేరుతో పాటు ప్రాంతీయ భాషల పేర్లను పెట్టుకోవచ్చని తన ఆదేశాలను సవరించుకుంది. ఊళ్ల పేర్లుఏముండాలో అవి ఏ భాషలో ఉండాలోకూడా కేంద్రమే నిర్దేశిస్తుంటే విభిన్న భాషలు సంస్కృతులున్న సు