ఆమ్‌ఆద్మీ బీఆర్‌ఎస్‌ కరెన్సీ బంధం.. ఈడీకి సుఖేష్‌ సంచలన లేఖ

By KTV Telugu On 2 April, 2023
image

హీరోయిన్లకు ఆఫ్‌ స్క్రీన్‌ హీరో. పొలిటికల్‌ పార్టీలకు ఫండింగ్‌ బ్యాంకర్‌. ఒకే ఒక్కడు బాలీవుడ్‌నీ లీడర్లనీ షేక్‌ చేస్తున్నాడు. ఎన్ని బాంబులున్నాయో తెలీదు. టైం చూసుకుని ఒక్కోటీ పేలుస్తున్నాడు. ఆర్థిగ నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్‌ ఇప్పుడు పేల్చిన బాంబు ఢిల్లీనుంచి తెలంగాణదాకా రీ సౌండ్‌ ఇస్తోంది. కేజ్రీవాల్‌ కేసీఆర్‌ పార్టీలను టార్గెట్‌ చేసుకుని సుఖేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీహార్‌ జైలు నుంచే సుఖేష్‌ విడుదల చేసిన ఓ లేఖ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమ్‌ఆద్మీకి బీఆర్‌ఎస్‌కి ముడిపెడుతూ ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ గుట్టు బయటపెట్టాడు సుఖేష్‌.

లిక్కర్‌స్కామ్‌కి సౌత్‌గ్రూపే కీలకం ఈడీ చేస్తున్న అభియోగం ఇదే. కానీ విచిత్రంగా ఈస్కామ్‌లో సాక్షిలా జొరబడ్డాడు సుఖేష్‌ చంద్రశేఖర్‌. లిక్కర్‌ స్కామ్‌కు మరో ఆధారాన్ని అందించేలా ఈడీకి లేఖ రాశాడు. అందులో కేజ్రీవాల్‌ కేసీఆర్‌ పార్టీలు టార్గెట్‌గా సంచలన ఆరోపణలు చేశాడు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో చేతులు మారిన 75కోట్ల రూపాయల గుట్టు విప్పాడు సుఖేష్‌. హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ దగ్గరే కథంతా జరిగిందని సంచలన ఆరోపణ చేశాడు సుఖేష్‌. కేజ్రీవాల్‌ చెబితేనే బీఆర్‌ఎస్‌కి 75కోట్లు ఇచ్చానంటూ చెప్పాడు. కాకపోతే ఇదంతా 2020లో జరిగిందని ఈడీకి రాసిన లేఖలో వెల్లడించాడు. 15కోట్ల చొప్పున ఐదుసార్లు ముట్టజెప్పానని స్టేట్మెంట్‌ ఇచ్చాడు.

లిక్కర్‌స్కామ్‌లో ఇప్పటికే కోడ్‌ డీకోడింగ్‌తో ఎన్నో సంభాషణల గుట్టు విప్పింది ఈడీ. కాల్‌డేటా వాట్సాప్‌ మెసేజ్‌లతో కేసును పక్కాగా ఫ్రేమ్‌ చేసింది. ఈ కేసులో ఇప్పుడు మరో కోడ్‌ బయటపెట్టాడు సుఖేష్‌. కేజ్రీవాల్‌ సూచనతో కేసీఆర్‌ పార్టీకి డబ్బులచ్చే ఆపరేషన్‌కు 15 కిలోల నెయ్యి అంటూ కోడ్‌ వర్డ్‌ పెట్టుకున్నారట. కేజ్రీవాల్‌తో తాను జరిపిన 7వందల పేజీల వాట్సాప్‌ చాట్‌ ఉందంటున్నాడు సుఖేష్‌. బీఆర్‌ఎస్‌ కార్యాలయ ఆవరణలో రేంజ్‌ రోవర్‌ కారులో ఉన్న ఏపీ అనే వ్యక్తికి డబ్బిచ్చినట్లు సుఖేష్‌ చెబుతుండటంతో ఆ వ్యక్తి ఎవరన్న చర్చ మొదలైంది. అక్కడితోనే ఆగలేదు సుఖేష్‌. ఆ కారు నెంబర్‌ 6060 అంటూ సంచలన విషయాలు బయటపెట్టాడు.

సుఖేష్‌ పెద్ద మాయగాడు ఆర్థిక నేరగాడు 30 కేసుల్లో నిందితుడు. అలాంటి చీటర్‌ సడెన్‌గా తెరపైకి వచ్చి ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. కేజ్రీవాల్‌పై ఈమధ్యే సంచలన కామెంట్స్‌ చేశాడు సుఖేష్. ఇప్పుడు ఉన్నట్టుండి ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక ఆరోపణలు చేయడం చర్చనీయాంశమవుతోంది. సుఖేష్‌ చంద్రశేఖర్‌ 2వందల కోట్ల రూపాయల మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి జైల్లో ఉన్నాడు. సీబీఐ ఈడీ కేసుల నుంచి విముక్తి కలిగిస్తానంటూ వ్యాపారవేత్తలకు టోపీ పెట్టాడీ ఘరానా మోసగాడు. జైలు బయట హీరోయిన్లతో ఎంత విలాసవంతమైన జీవితం అనుభవించాడో జైలు గోడల మధ్య కూడా అదే రేంజ్‌లో నడుస్తోంది సుఖేష్‌ జీవితం. సుఖేష్ వాడే చెప్పుల విలువే లక్షన్నర. అతడి 3 ప్యాంట్ల ఖరీదు రూ.80 వేలు. మరి ఇంత కన్నింగ్‌ చీటర్‌ రెండు రాజకీయపార్టీలపై ఆరోపణలు చేయటంతో ఈడీ ఎలా స్పందిస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.