తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో సారి ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైనవవి రైతుల రుణమాఫీ నిరుద్యోగ భృతి. రైతుల రుణమాఫీది పెద్ద కథ ఆ విషయం పక్కన పెడితే నిరుద్యోగ భృతి అయితే అసలు పట్టాలెక్కలేదు నాలుగేళ్ల నుంచి ఇదిగో అదిగో అంటూ కాలం గడుపుతూనే ఉన్నారు. కేటీఆర్ ప్రతీ ఏడాది త్వరలో పథకం అమలు అని చెబుతూనే ఉన్నారు. రేపోమాపో పథకం అమలును కేసీఆర్ ప్రకటిస్తారన్నారని రెండేళ్ల కిందట చెప్పారు కానీ ఇప్పటి వరకూ అమల్లోకి రాలేదు. ఈ భృతి పథకం అమలుపై నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు బడ్జెట్లలో దీని గురించి ప్రస్తావించలేదు. మూడో బడ్జెట్‌లో కేటాయించారు కానీ నిధులు విడుదల చేయలేదు చివరి బడ్జెట్‌లో అసలు నిధులు కేటాయించలేదు.
తెలంగాణలో నిరుద్యోగం రేటు ఎక్కువగానే ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణ ఏర్పుటు ముందు పది జిల్లాల్లో దాదాపుగా పది లక్షల మంది నిరుద్యోగులున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేటు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు మెరుగుపడినా నిరుద్యోగుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. అయితే నిరుద్యోగి అనే ప్రామాణికమే కీలకం కానుంది. అర్హతలు నిర్ణయించే దాన్ని బట్టి లబ్దిదారుల సంఖ్య పెరగడమో తగ్గడమో జరుగుతుంది. లక్షల మందికి నెలకు జీతం ఇచ్చినట్లుగా రూ.3016 ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. ఆర్థిక కష్టాల్లో ఉన్న తెలంగాణ సర్కార్‌కు ఇబ్బందికరమే. కానీ హామీలను అమలు చేయక తప్పని పరిస్థితి నిరుద్యోగ భృతినిని గతంలో చంద్రబాబు సర్కార్ అమలు చేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చి మళ్లీ ఎన్నికలకు కొంత ముందు ప్రారంభించడంతో రావాల్సిన మైలేజీ రాలేదు. అసలు పథకమే ప్రారంభించని కేసీఆర్ సర్కార్ నిరుద్యోగుల్ని మోసం చేసినట్లయింది.
రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది అన్న అంశంపై ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం లేదు. అయితే 10వ తరగతి ఇంటర్ డిగ్రీ పీజీ పీహెచ్‌డీ తదితర స్థాయిల్లో చదువులు చదివినా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక దాదాపు 30 లక్షలమందికిపైనే నిరుద్యోగులున్నట్టు ప్రభుత్వవర్గాలు అంచనా వేస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో 25 లక్షల మంది నిరుద్యోగులు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ కింద తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోని నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉండనున్నారు. ఎన్నికల హామీ మేరకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లిస్తే ఒక అభ్యర్ధికి ఏడాదికి రూ.36,192 కోట్లు వ్యయం కానుంది. ఈ లెక్కన ఏడాది కాలంలో 10 లక్షల మంది నిరుద్యోగభృతికి రూ.3,619.20 కోట్లు, 20 లక్షల మందికి చెల్లించడానికి రూ.7,238.4 కోట్ల నిధులను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 2019 బడ్జెట్‌లో 1,810 కోట్లు సైతం ప్రభుత్వం కేటాయించింది. తర్వాత ఆర్థిక ప్రతికూలతలతో ఈ పథకాన్ని అమలు చేయలేదు.
చంద్రబాబు 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారు. 2018 ఆగస్టులో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 12.26లక్షల మందికి నెలకు రూ. 1000 చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి యువనేస్తం పేరును ఖరారు చేశారు. గతంలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాసాధికారిత సర్వేలో రిజిస్టర్ చేసుకున్న వారిలో నిరుద్యోగులకు చాన్సిచ్చారు. కానీ అక్కడ డబ్బులిచ్చి యువతను నిర్వీర్యం చేయకుండా ఎల్లప్పుడూ నిరుద్యోగులు ఉండకుండా ఆ పథకం స్కీమ్ తీర్చిదిద్దారు. యువతను పట్టుబట్టి ఉద్యోగస్తులు మార్చే ప్రణాళిక అమలు చేశారు. నెలకు రూ.వెయ్యి ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకో లేదు. పథకం కోసం ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్ ఏర్పాటు చేస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే తనకు ఇష్టమైన రంగాన్ని నిరుద్యోగ భృతి ఆశిస్తున్న యువతీ యువకుడు పేర్కొనాలి. స్వయం ఉపాధి పరిశ్రమల్లో అప్రెంటిస్ షిప్ ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వివిధ బీసీ సమాఖ్యలు ఇలా పలు విభాగాలు ఇప్పటికే అందిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో నుంచి ఒక దాన్ని ఎంపిక చేసుకోవాలి.
ఎక్కవ కాలం నిరుద్యోగ భృతి తీసుకోకుండా ప్రభుత్వం ఉద్యోగాలు చూపించింది. రిజిస్టర్ చేసుకున్న అర్హులైన వారి వివరాలు వారు ఎంచుకున్న శిక్షణ రంగాలను జిల్లాల వారీగా డీఆర్‌డీఏ పీడీలకు పంపిస్తారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో నెల రోజులపాటు శిక్షణ ఏర్పాటు చేస్తారు. శిక్షణ కోసం ఒక్కో అభ్యర్థికి రూ.12వేలు ఖర్చు చేయనున్నారు. దీన్ని ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్రంలో రాబోయే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ భృతి తీసుకుంటున్న యువతను తీర్చిదిద్దుతారు. పరిశ్రమల అవసరాలు తెలుసుకుని వారి ఉద్యోగావసరాలకు తగిన శిక్షణ ఇస్తారు. అదేసమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు కంపెనీలు పరిశ్రమల్లో అప్రెంటిస్ షిప్ గా కూడా వీరిని ఎంపిక చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. నిరుద్యోగ భృతి కోసం ఏర్పాటుచేసే ప్రత్యేక వెబ్‌పోర్టల్‌లోనే భవిష్యత్తు ఉద్యోగావకాశాల సమాచారం కూడా అందిస్తారు. అదేవిధంగా వెబ్‌పోర్టల్‌లో నమోదైన యువత వివరాలను కంపెనీలకూ అందిస్తారు. ఆయా కంపెనీల్లో ఉద్యోగావకాశాలకు తగినవారుంటే ఎంపిక చేసుకునేలా సమన్వ యం చేస్తారు. మొత్తం నిరుద్యోగ భృతి కింద నమోదైన వారందరికీ శిక్షణ ఇస్తారు. దీని ద్వారా ఎంత మంది యువతకు ఉద్యోగాలిచ్చామో ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. పరిశ్రమకు మ్యాన్ పవర్ సమస్య లేకుండా చూసే అవకాశం దొరుకుంది. అదే విధంగా ఉద్యోగావకాశాల్ననింటినీ ఒకే వేదికపైకి తెచ్చినట్లయింది. పథకన్ని అమలు చేసినట్లయిది.
ఏపీలో అమలు చేసినట్లుగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించి వారికి ట్రైనింగ్ ఇచ్చి ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తే పథకం ప్రయోజనం నెరవేరే అవకాశం ఉంది. తెలంగాణలో పారిశ్రామికీకరణ ఎక్కువగా ఉంది. వందల కంపెనీలకు మ్యాన్ పవర్ సమస్య ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకో ఈ అంశంపై దృష్టి సారించలేదు. అందుకే ప్రభుత్వంపై హామీని నెరవేర్చలేదనే మరక పడిపోయింది.