*ఆదిపురుష్ పై భారీ ట్రోలింగ్
*రెండుగా చీలిన సోషల్ మీడియా
ఏది అయితే జరగకూడదు అని ప్రభాస్ అభిమానులు అనుకుంటూ వచ్చారో అదే జరిగింది. ఏడాదిగా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ను టీజర్ ను దాస్తూ వచ్చిన దర్శకుడు ఓం రౌత్. దసరా కానుకగా సడన్ సర్ ప్రైజ్ అంటూ అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ ను విడుదల చేసాడు. అసలే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అప్పటి నుంచే అనుమానాలు మొదలయ్యాయి. ప్రభాస్ లుక్ బాగోలేదంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కంప్లైంట్ చేయడం మొదలు పెట్టారు. టీజర్ రిలీజ్ తర్వాత పరిస్థితులు మారుతాయని అందరూ ఊహించారు. ఎందుకంటే ఆదిపురుష్ దర్శకుడు గతంలో తానాజీ అనే హిందీ చిత్రం తీసి, బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసాడు. గొప్పగా గ్రాఫిక్స్ వినియోగించుకుని శభాష్ అనిపించుకున్నాడు. కాని ఆదిపురుష్ టీజర్ రిలీజైన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయింది. సాహో, రాధేశ్యామ్ సినిమాల కంటే దారుణంగా టీజర్ ఉంది.
సినిమాలో అస్సలు ప్రభాస్ కనిపించడం లేదు. ఆదిపురుష్ లుక్ అనేది ప్రభాస్ కు సూట్ కాలేదు. లంకాధిపతి అయితే గేమ్ ఆఫ్ త్రోన్స్ లో జాన్ స్నోను గుర్తు చేస్తున్నాడు అంటున్నారు. అమీర్ పేట గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రభాస్ ఇంత కాలం ఎందుకు కష్టపడ్డాడు అంటూ అతని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ఆదిపురుష్ సినిమాను థియేటర్స్ కంటే డైరెక్ట్ గా కార్టూన్ నెట్ వర్క్ లో రిలీజ్ చేస్తే బెటర్ అనేంతగా ట్రోలింగ్ జరగుతోంది.. ఈ మధ్య కాలంలో విడుదలైన ఏ సినిమా కూడా ఏ స్థాయిలో ట్రోలింగ్ జరగలేదు. మరో వైపు ఆయోధ్యలో టీజర్ లాంచ్ సమయంలో ప్రభాస్ ఈ సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ముందు అస్సలు శ్రీరాముడిగా తాను నటించేందుకు ఇష్టపడలేదని, మూడు నెలల పాటు నో చెబుతూ వచ్చానని అన్నాడు ప్రభాస్. ఈ కామెంట్స్ విని మూడు నెలల తర్వాతైనా ఎందుకు సినిమాకు ఎందుకు ఎస్ చెప్పావ్ నిలదీస్తున్నారు డైహార్డ్ ఫ్యాన్స్.