ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చాకే ఛీర్స్ లీడర్స్‌ని ఓపెన్ గ్రౌండ్‌లో చూస్తున్నాం. ఫారిన్ కల్చర్‌ని మన గ్రౌండ్‌దాకా తీసుకొచ్చిన ఘనత ఐపీఎల్‌దే. ఆ మధ్య కరోనా టైంలో ఆ ఛీర్ లీడర్స్ లేక వాళ్ల గెంతులు కనిపించక క్రికెట్ ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఛీర్ లీడర్స్ ఐపీఎల్ మ్యాచ్‌లకు ఫుల్ కిక్ ఇస్తున్నారు. బాల్ బౌండరీ దాటినీ పెవిలియన్‌లో పడ్డా వికెట్ పడ్డా ప్రతీవారి చూపు గ్రౌండ్ పక్కనున్న ఛీర్ లీడర్స్ రియాక్షన్‌మీద పడుతోంది. అంతగా ఈ లీగ్‌లో పాలూనీళ్లలా కలిసిపోయారు వాళ్లు. కోట్లకు కోట్లు ఇచ్చి ఒక్కో ఆటగాడిని ఫ్రాంచైజీలు కొనుక్కుంటాయి. అందుకే అంత కాస్ట్‌లీ గేమ్స్‌కి కాస్త ఎంటర్‌టైన్మెంట్ మిక్స్ చేయకపోతే ఏం బావుంటుంది. అందుకే ఐపీఎల్ టోర్నీలో ఛీర్ గాళ్స్‌కి అంత ప్రయారిటీ.
ఆటగాళ్లకు ఏ ఫ్రాంచైజీ ఎంతిస్తుందో అందరికీ తెలుసు. మరి ఛీర్ లీడర్స్‌కి ఎంతిస్తారన్నది కూడా కొందరికి ఆసక్తికరమే. ఛీర్‌లీడర్స్ కూడా టీములను బట్టే ఉంటారు వారికి కూడా ఆయా ఫ్రాంఛైజీలే డబ్బు చెల్లిస్తుంటాయి. ఫ్రాంఛైజీలను బట్టి ఆ మొత్తాలు మారుతుంటాయి. ఎక్కువా తక్కువా యావరేజ్ చేస్తే ఛీర్‌లీడర్స్ ఒక్కొక్కరు ఒక్కో మ్యాచ్‌కు రూ.14 వేనుంచి 17 వేల దాకా తీసుకుంటారు. వీరిలో ఎక్కువమంది విదేశీ యువతులే మనవాళ్లు పరిమితంగానే ఉంటారు. చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఆటగాళ్లను అభిమానులను ఉల్లాసపరిచే ఛీర్‌లీడర్లకు రూ.12 వేల చొప్పున ఇస్తాయని సమాచారం. ముంబై ఇండియన్స్ ఆర్సీబీ వంటివి ఒక్కో ఛీర్ లీడర్‌కి సగటున రూ.20 వేలదాకా చెల్లిస్తుంటాయి. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి పారితోషికం ఇవ్వడంలో టాప్‌లో ఉంటోంది. ఒక్కో ఛీర్ లీడర్‌కి కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.24 వేలు చెల్లిస్తోంది. అది కూడా ఒక్క మ్యాచ్‌కి.
ఛీర్ లీడర్స్ అనగానే గెంతులేసే వాళ్లదేముందని చీప్‌గా తీసుకోవద్దు వాళ్లకీ ఓ రేంజ్ ఉంది. సాఫ్ట్‌వేర్‌ని మించిన జీతాలుంటున్నాయి. కాకపోతే అందచందాలే వీళ్ల ప్రధాన అర్హత. వీరికి వేతనంతో పాటు ఇచ్చే ప్రదర్శనను బట్టి బోనస్ కూడా ఇస్తుంటారు. వీరు ఏ జట్టుకోసమైతే అభినయిస్తారో ఆ జట్టు గెలిస్తే అదనంగా డబ్బులొస్తాయి. విలాసవంతమైన వసతి సదుపాయం స్టార్ హోటల్ రేంజ్ భోజనసదుపాయం వీరికి కల్పిస్తుంటారు. ఎంత సంపాదించినా ఆస్వాదించేవారంతా ఒకేలా ఉండరుగా. కొందరు వీరిని చీప్‌గా చూస్తుంటారు. కొందరు ఛీర్ లీడర్స్ అవమానాలు ఎదుర్కుంటూ ఉంటారు. తమను కొందరు చులకనగా చూసినా వారు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతారు. కేవలం అందచందాలుంటే సరిపోదు. ఛీర్‌లీడర్లుగా ఎంపికకావడానికి ఎన్నో రౌండ్ల ఇంటర్వ్యూలు పూర్తిచేయాల్సి ఉంటుంది. డ్యాన్సులో మోడలింగ్‌లో అనుభవం ఉండాలి. జనసమూహంలో తొణక్కుండా బెణక్కుండా పర్‌ఫామెన్స్ ఇచ్చిన అనుభవం కూడా ఉండాలి. ఇన్ని ఉంటేనే వారు క్రీడాభిమానులకు ఆటతో పాటు కనువిందు చేయగలుగుతారు.