నీలమేఘశ్యాముడు..సుగుణాభి రాముడు జగదభిరాముడు. రాముడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తండ్రి మాటని జవదాటని కొడుకుగా తల్లికోసం రాజ్యాన్నే వదులుకున్న త్యాగమూర్తిగా ధర్మకోసం పోరాడిన యోధుడిగా సుగుణాలకు ఆదర్శపురుషుడిగా ఉన్నందునే శ్రీరాముడిని అంతా పురుషోత్తముడిగా కీర్తిస్తారు. విలువలతో కూడిన సంపూర్ణమైన జీవితానికి శ్రీరాముడు అందరికీ ఆదర్శం. ఒక వ్యక్తి ఎలా ఉండాలో చెప్పడానికి ఆయన జీవితమే అందరికీ ఆదర్శనీయం. రాముడిని మించిన అందగాడు సీతను మించిన సౌందర్యరాశి మరొకరు ఉండరనేది పురాణ ప్రతీతి. చారిత్రక కథనాల ప్రకారం చూస్తే శ్రీరాముడిది అద్భుతమైన శరీరాకృతి. దేదీప్యమానమైన ముఖవర్ఛస్సు మనోహరమైన నుదురుతో ఆయన రూపాన్ని అంతా రెప్పవాల్చకుండా చూస్తుండిపోతారంటారు.
శ్రీరాముడు ఎలా ఉంటాడన్నదానిపై మనకో ఊహాజనిత రూపం ఉంది. విగ్రహాల్లో చిత్రపటాల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేకరూప సారూప్యం కనిపిస్తుంది. శ్రీరాముడి ముగ్ధమోహనరూపం గురించి కవులు ఎన్నో రకాలుగా వర్ణించారు. రామాయణంలోనూ ఆయన సమ్మోహన రూపం గురించి అద్భుతంగా వర్ణించారు. శ్రీరాముని ముఖం చంద్రునిలా కాంతివంతంగా సౌమ్యంగా సున్నితంగా అందంగా ఉండేదని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు. శ్రీరాముడికి చెందిన చిత్రాలు అందుబాటులో ఉన్నా అవన్నీ ఊహాజనితమైనవే. అయితే అసలు వాస్తవానికి శ్రీరాముడు ఎలా ఉండేవాడు 24 ఏళ్ల వయసులో ఆయన ఎంత ముగ్ధమనోహరమైన రూపంలో ఉన్నారన్న ప్రశ్నలు చాలా మందిలో మెదులుతూనే ఉంటాయి. వీటన్నిటికీ జవాబుగా సోషల్ మీడియాలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రూపొందించిన ఓ ఫోటో బాగా వైరల్ అవుతోంది. శ్రీరాముడు 21 ఏళ్ల వయసులో ఎలా ఉండేవారన్న సందేహాన్ని తీర్చుకునేందుకు ఓ వ్యక్తి కృత్రిమ మేథను వాడాడు. దీంతో 21 ఏళ్ల వయస్సులో రాముడు ఎలా ఉండేవాడో ఆయన నవయవ్వన రూపాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపించింది.
శ్రీరాముడి నవ యవ్వన రూపాన్ని చూసి మైమరిచిపోనివారు ఉండరు. అంత అందంగా అద్భుతంగా ఉందా చిత్రం. నిజంగా కళ్లు తిప్పుకోలేనంత అందమైన రూపాన్ని ఆవిష్కరించింది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. వాల్మీకి రామాయణం రామచరిత మానస్ వంటి గ్రంథాల్లో ఇచ్చిన రాముడి రూపురేఖలను ఇన్‌పుట్స్‌గా ఇవ్వడం ద్వారా రాముడి రూపాన్ని సృష్టించింది కృత్రిమ మేధస్సు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోపై నెటిజన్లనుంచి ప్రశంసల వర్షంకురుస్తోంది.
రాముడు అచ్చుగుద్దినట్లు ఇలాగే ఉండేవాడా అంటే ఎవరూ చూసింది లేదుగానీ కృత్రిమమేథ సృష్టించిన రూపురేఖలను చూసి రామభక్తులు తన్మయత్వం చెందుతున్నారు. సాధారణంగా మనం చూసే రాముడి రూపానికి వందరెట్లు అందంగా ఆయన యవ్వనరూపం ఉండటంతో శ్రీరామ నీ నామమెంతో రుచిరా అంటూ తన్మయత్వంతో పాడుకుంటున్నారు.
ఇంతకీ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌తో రాముడిచిత్రాన్ని సృష్టించింది ఎవరో తెలీదుగానీ నెట్టింట వైరల్ అవుతోంది అందాల శ్రీరాముడి రూపం. శ్రీరాముడి ఫోటోతో పాటు సీతాదేవి కృత్రిమమేథ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీతమ్మ తల్లి చల్లని తల్లి అని రచనలు కీర్తనలల్లో ప్రస్తావిస్తారు. భర్త మాటకు ఎదురుచెప్పని మహా ఇల్లాలు. ఎంతో సహనశీలి ధైర్యవంతురాలు ఆత్మాభిమానం గల స్త్రీమూర్తిగా సీతాదేవిని కీర్తిస్తారు. సీతమ్మతల్లి జీవితం నేటి తరం మగువలకే కాదు భవిష్యత్ తరాలకీ ఆదర్శంగా చెబుతారు. అందం అణకువ కలిగిన మహా ఇల్లాలుగా సీతమ్మని తలుచుకుంటారు. 21 ఏళ్ల వయస్సులో సీతమ్మవారు ఎలా ఉండేవారో ఆమె ముగ్ధమనోహర రూపాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కళ్లకుకట్టింది.