రామ్ చరణ్ కొత్త సినిమా కన్ ఫామ్?
శంకర్ వల్లే మెగా పవర్ స్టార్ కు కొత్త సమస్య?
రామ్ చరణ్ నటించిన ధృవ అంటే మెగా ఫ్యాన్స్ కు చాలా ఇష్టం. ఈ సినిమాలో చరణ్ పోషించిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ టెర్రిఫిక్ గా ఉంటుంది. అతని కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కు కంటిన్యూటీ ఇవ్వాబోతున్నాడు చరణ్. త్వరలోనే ధృవ-2తో తిరిగిరాబోతున్నాడు. ఈ విషయాన్ని గాడ్ ఫాదర్ ప్రొడ్యూసర్స్ కన్ ఫామ్ చేసారు.
అసలు ధృవ -2 ప్రాజెక్ట్ ను దర్శకుడు మోహన్ రాజా ప్లాన్ చేస్తున్న సమయంలోనే, చిరుకు లూసిఫర్ రీమేక్ చేసి పెట్టమని చరణ్ అతడిని అడిగాడు. మెగా ఆఫర్ వదులుకోవడం ఇష్టం లేని మోహన్ రాజా, వెంటనే రంగంలోకి దిగాడు. గాడ్ ఫాదర్ ను సక్సెస్ ఫుల్ కంప్లీట్ చేసాడు. ఇఫ్పుడు రిలీజ్ కూడా చేసాడు. లూసిఫర్ ను గాడ్ ఫాదర్ గా మోహన్ రాజా మార్చిన విధానం చిరు, చరణ్ లకు బాగా నచ్చింది. అందుకే ధృవ -2 లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీసియల్ కన్ ఫర్ మేషన్ రానుంది. పనిలో పనిగా గాడ్ ఫాదర్ కనుక మంచి విజయాన్ని అందుకుంటే ఇంకాస్త త్వరగానే ధృవ2 ఎనౌన్స్ మెంట్ వచ్చినా ఆశ్చర్యం లేదు. మరో వైపు శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ నటిస్తున్న న్యూ మూవీ షూటింగ్ కు ప్రస్తుతానికి బ్రేక్ పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ తో భారతీయుడు 2 తెరకెక్కిస్తున్న శంకర్ ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ను శరవేగంగా పూర్తి చేసి విడుదల చేసిన తర్వాతే రామ్ చరణ్ తో చేస్తోన్న మూవీని పట్టాలెక్కిస్తానంటున్నాడట.
ఈ దశలో చరణ్ కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో మూవీ అనుకుంటే ఆ ప్రాజెక్ట్ ఎందుకో సెట్ కాలేదు. దాంతో RRRతో వచ్చిన ఇంపాక్ట్ తో మోహన్ రాజా మేకింగ్ లో ధృవ -2 చేయడమే బెటర్ అనుకుంటున్నాడట మెగా పవర్ స్టార్.