బీవేర్ ఆఫ్ ఫైల్స్, స్టోరీస్ – ఈ సినిమాలు ఎంత డేంజరంటే

By KTV Telugu On 11 May, 2023
image

 

కశ్మీర్ ఫైల్స్ వచ్చింది ది కేరళ స్టోరీ వచ్చింది. రేపు రజాకార్ ఫైల్స్ వస్తుంది తర్వాత హైదరాబాద్ స్టోరీ కూడా వస్తుంది. ఇంక ఢిల్లీ ఫైల్స్, ముంబై స్టోరీ ఇలా ఎన్ని సినిమాలు తెరపైకి వస్తాయో చెప్పడం కష్టం. అన్నింటి లక్ష్యం ఒకటే. ఓ వర్గం మీద వ్యతిరిక భావం నింపడం. ఆ వర్గం ఒకటే అవ్వాలని లేదు సినిమాను బట్టి టార్గెట్ మారుతోంది అన్నీ ఎన్నికలను టార్గెట్ చేసేవే. వర్గ పోరాటాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకునేవే. సహజంగానే ఇవి వివాదాస్పదమైన కేటగిరిలోకి వస్తాయి. దాంతో పబ్లిసిటీ పీక్స్ కు చేరుకుంటుంది కలెక్షన్ల వర్షం కురుస్తుంది దీనికి రాజకీయ పార్టీలు అఫీలియేషన్లు తీసుకుంటాయి. దీంతో ఆ పార్టీ సానుభూతిపరులు పోలోమంటూ ధియేటర్లకు వెళ్తారు. కానీ ఈ సినిమాలు రాజకీయ పార్టీలకు మేలు చేస్తున్నాయి కానీ దేశానికి ఎంత నష్టం చేస్తున్నయో ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించడం లేదు. ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నాయి. కనిపించని విభజనను పెంచుతూ పెతున్నాయి.

గత ఏడాది సైలెంట్ గా రిలీజైన సినిమా కశ్మీర్ ఫైల్స్. కానీ ఇది చేసిన హడావుడి మాత్రం చిన్నది కాదు. బాక్సాఫీస్ లో వందల కోట్ల కనకవర్షం కురిపించింది. అంతే కాదు భారతీయ జనతా పార్టీకి ఓ వరం అయింది. అయితే పాజిటివ్ లేదా నెగటివ్ ఈ సినిమా గురించి మాట్లాడిన వాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. కశ్మీర్ లో హిందూ పండిట్లపై జరిగిన దారుణమైన ఊచకోత కథాంశంగా వచ్చిన ఈ సినిమాను సపోర్ట్ చేసిన వాళ్లు కన్నీళ్లు పెట్టుకుని నాటి ఘటనలను గుర్తు తెచ్చుకుని కృతజ్ఞతలు చెప్పుకున్న వాళ్లు ఎంత మంది ఉన్నారోbనాటి ఘటనను పొలిటికలైజ్ చేశారంటూ ఇందులో ప్రధానంగా బీజేపీ హస్తం ఉందంటూ విమర్శించిన వాళ్లు ఉన్నారు. అయితే ఇందులో చూపించినవి నిజమని వాదించిన వారు కొందరు అబద్దమని వాదులాటకు దిగిన వారు కొందరు ఉన్నారు. అంత దారుణమైన పరిస్థితులు లేవని కేవలం రాజకీయ అవసరాల కోసమే ఇలా చేశారని చెప్పిన వాళ్లూ ఉన్నారు. గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-IFFI లో జ్యూరీకి అధ్యక్ష హోదా లో ఉన్న ఇజ్రాయెల్ కు చెందిన డైరెక్టర్, రైటర్ నాదవ్ లాపిడ్ ఈ సినిమా చూసి దిగ్భ్రాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సినీ మహోత్సవంలో ప్రదర్శించేందుకు ఈ సినిమా తగదు. అంటూ అభిప్రాయాన్ని చెప్పారు. ఆయన అభిప్రాయం ఎలా ఉన్నా అది ప్రాపగాండా సినిమా అనేదే ఎక్కువ మంది నమ్ముతున్నారు. నిజం చాలా ప్రమాదకరమైనది. ఇది ప్రజలతో అబద్దాలు చెప్పించగలదు అంటూ ట్వీట్ చేశారు.

మొన్నటిదాకా కాశ్మీర్‌ ఫైల్స్‌. ఇప్పుడు ది కేరళ స్టోరీ. కశ్మీర్ ఫైల్స్ లానే ఇది కూడా వివాదాస్పదమే. 32వేల మంది కేరళ మహిళాలు అక్కడ నుంచి అదృశ్యమయ్యారని ట్రైలర్‌లో చూపించడంతో వివాదం మొదలైంది. ఫ్రూఫ్ చూపించమంటూ దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగ‌డంతో ముగ్గురు మహిళలు మాత్రమే అదృశ్యమ‌య్యారంటూ నంబర్‌ని ఎడిట్ చేశారు మూవీ మేకర్స్‌. అయితే ఇక్కడ విషాదం ఏమిటంటే కేరళలో వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారన్నదానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ కొన్ని ఘటనలు ఉన్నాయి అవి చాలా స్వల్పం. వాటి ఆధారంగా తీశారు. కానీ ప్రచారం మాత్రం 32వేల మంది యువతులు మిస్సింగ్. ప్రస్తుత డిజిటల్ కాలంలో పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కువ మంది ఏది నమ్మితే అదే నిజం. ఇలాంటి సినిమాల ద్వారా ఏది నిజమని నమ్మిస్తే అదే నిజం ఇప్పటికీ చాలా మంది కేరళ నుంచి 32 వేల మంది యవతులు మిస్సయ్యారంటే నమ్ముతారంటే అతిశయోక్తి కాదు.

వివాదాల కారణంగా అటు కశ్మీర్ ఫైల్స్ కు ఇటు కేరళ స్టోరీకి పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చాయి. ఓ వైపు బీజేపీ సపోర్ట్ మరో వైపు కాసుల వర్షం కురిస్తే ఇక ఇతరులు నిర్మాతలు బీజేపీ సానుభూతిపరులు పండగ చేసుకోకుండా ఉంటారా చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే రజాకార్ ఫైల్స్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో అత్యంత వివాదాస్పదమన అంశాలు ఉంటాయి. తెలంగాణ ఎన్నికల్లో ఇదే హాట్ టాపిక్ అయినా ఆశ్చర్యం లేదు. అలాగే తాజాగా ఉగ్రవాదులు ముఖ్యంగా హిందూ యువకులు మతం మార్చుకుని మరీ ఉగ్రవాదంలోకి వెళ్తున్నట్లుగా మధ్యప్రదేశ్ పోలీసులు బయట పెట్టడంతో హైదరాబాద్ స్టోరీ కాన్సెప్ట్ కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే కశ్మీర్ ఫైల్స్ తీసిన వివేక్ అగ్నిహోత్రి ఢిల్లీ ఫైల్స్ అనే సినిమా తీస్తున్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై సినిమాలు వెల్లువలా రానున్నాయని తెలుస్తూ ఉంది.

భిన్న జాతుల దేశం మనది అందరూ కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి. మత అల్లర్ల, కుల కొట్లాటలు జరిగితే బ్రిటిష్‌ పాలన రోజుల గతి పట్టాల్సిందే. ఈ మధ్య కాలంలో సామాజిక కోణం పేరిట తమ రాజకీయ లబ్ధి కోసం కొందరు పార్టీ నేతలే సినిమాలకు రూపకల్పన చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదో ఒక వర్గాన్ని టార్గెట్‌ చేసుకొని సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఇందులో నిజానిజాలు సంగతి పక్కన పెడితే దేశంలో ప్రస్తుతమున్న అసలు సమస్యలను సైడ్ ట్రాక్‌ చేసి దేశమంతా సినిమా గురించే మాట్లాడుకునేలా ఓ హైప్‌ క్రియేట్ అవుతోంది. మెజారిటి వర్గాల ఓట్లతో అధికారం దక్కించుకోవాలనే పార్టీల్లో అందరికంటే ముందుండే బీజేపీ ఇలాంటి స్టోరీలు, ఫైల్స్ సినిమాను ప్రోత్సహిస్తోంది. వాటి నిర్మాణం వెనుక పరోక్షంగా బీజేపీ ఉంటోంది. రిలీజ్ తర్వాత ప్రత్యక్షంగా ప్రమోషన్ బాధ్యత తీసుకుంటోంది. ఉగ్రవాద కుట్ర కోణాన్ని తెలిపే ‘ది కేరళ స్టోరీ’ సినిమాను కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మోదీ కర్ణాటక ప్రచారంలో కూడా ఆరోపించారు. కాంగ్రెస్‌ ముస్లిం పక్షపాతి అనే చెప్పే ప్రయత్నం ఇది. దీని ద్వారా మెజర్టీ వర్గం ఓట్లు దండుకోవచ్చు ఈ లవ్‌ జీహాద్‌లు, మత మార్పిడిలు ఉన్నామాట వాస్తవామే కావొచ్చు కానీ ఇక్కడ సమస్య నిజానిజాలది.

రాజకీయం అంటే ప్రజలకు మేలు చేయడం. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడం కాదు. కానీ దురదృష్టవశాత్తూ దేశంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. ఇలాంటి సినిమాల వల్ల ప్రజల్లో వచ్చే చీలిక భవిష్యత్‌లో ఎంత దారుణమైన పరిస్థితుల్ని తెచ్చి పెడుతుందో అంచనా వేయడం కష్డం. సినిమా అనేది ఒక మాధ్యమం. వినోదం, విజ్ఞానం, సందేశం పంచే ఒక శక్తివంతమైన మాధ్యమం. సామాజికాంశాలతో పాటు చరిత్రను ప్రతిబింబించే ఇతివృత్తాలతో సినిమాలు ఎన్నో సమాజాన్ని ప్రభావితం చేశాయి. దురదృష్టవశాత్తూ బాగా తక్కువ అక్షరాస్యత ఉన్న కాలంలో మంచి భావాలాతో అందరం ఒకటే భావనతో సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు దేశంలో అక్షరాస్తయ భాగా పెరిగిన తర్వాత మనషులంతా ఒక్కటి కాదు వారిలో కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు ఉంటాయని వాదిస్తున్నారు. ఆ ప్రకారమే అందరూ విడిపోతున్నారు. దీన్ని గుర్తించలేని స్థితిలో రాజకీయ పార్టీలు లేవు. కానీ వివాదాల మంటలు రేపినా అది తాత్కాలిక ప్రయోజనాలను పొందుతున్నారు. ఇది దేశానికి చోటు చేస్తోంది. కానీ ఎవరూ గుర్తించడం లేదు. ప్రజలు కూడా ట్రాన్స్‌లో ఉండిపోతున్నారు.