ట్రోలర్స్ బీకేర్ ఫుల్
3డీలో చూడండి మీకే తెలుస్తుంది
ఒక వైపు దేశం మొత్తం ఆదిపురుష్ టీజర్ చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, దర్శకుడు ఓం రౌత్ సినిమాను అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు నిర్మాత దిల్ రాజు. మైథలాజికల్ మూవీని ఇలాగే తీయాలని రూల్స్ ఏం లేవంటూ ఆదిపురుష్ సినిమాను వెనుకేసుకొచ్చాడు. అంతే కాదు బాహుబలి మొదటి భాగం రిలీజైనప్పుడు, కొందరు సినిమా చూసి బాహబలి శివుడ్ని ఎత్తిన స్థానంలో జండూ భామ్ ను ఎత్తినట్లు తాను చూసిన ఫోటోలను గుర్తు చేసుకున్నారు. అంతే కాదు బాహుబలి -1 సూపర్ హిట్ అవుతుందని నేను ప్రభాస్ కు ముందే చెప్పానన్నాడు దిల్ రాజు. ఇప్పుడు ఆదిపురుష్ విషయంలోనూ తన అంచనా తప్పు కాదని ఒక్కసారి ఈ సినిమా థియేటర్ లోకి ఎంట్రీ ఇస్తే వేరే లెవకు వెళ్తుందని దిల్ రాజు చెప్పాడు. ఆదిపురుష్ అనే సినిమా ఈతరం ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా అని , 3డిలో చూస్తే సినిమా రేంజ్ ఏంటి అనేది అర్ధం అవుతుంది అంటున్నాడు దిల్ రాజు. ఒక వైపు విశ్వ హిందూ పరిషత్ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకపోతే బ్యాన్ తప్పదని హెచ్చరిస్తుంటే దిల్ రాజు మాత్రం సినిమాకు ఓపెన్ గా సపోర్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మరో వైపు ప్రభాస్ కూడా ఆదిపురుష్ మూవీని థియేటర్ లోచూసిన తర్వాతే ఒక అంచనాకు రావాలంటున్నాడు. ఇండియాలో ఇలాంటి టెక్నాలజీతో తెరకెక్కిన మొదటి సినిమా ఇదే అని చెబుతున్నాడు. జనవరి 12న ఆదిపురుష్ రిలీజ్ అవుతోంది. ఈ లోపు ఆదిపురుష్ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.