Ktv Telugu :తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బండి సంజయ్ ను తీసేసి కిషన్ రెడ్డిని నియమించారు అని తెలియగానే చాలా మంది ఇక బీజేపీ ఆశలు వదిలేసుకుందన్న అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి రెండు సార్లు ఇప్పటి తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా చేశారు. పార్టీపై ఆయన నిబద్దతను ఎవరూ ప్రశ్నించలేరు. కానీ ఇప్పుడు కిషన్ రెడ్డికి బాధ్యతలు అంటే మాత్రం బీజేపీ క్యాడర్ కూడా నిరాశ చెందుతున్నారు. సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తల నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి లో బండి సంజయ్ కు ఉన్నంత దూకుడు లేదు. ఆయనది సాఫ్ట్ నేచర్. ముఖ్యంంగా బీఆర్ఎస్ నేతలు చేసే రాజకీయానికి తగ్గ దూకుడు చూపించరని.. బండి సంజయ్ అయితేనే కరెక్టని ఎక్కువ మంది నమ్ముతారు. అయినా బండి సంజయ్ ను ఎందుకు పక్కన పెట్టారు..? కిషన్ రెడ్డి నుంచి బీజేపీ హైకమాండ్ ఏం ఆశిస్తోంది ?
శభాష్ బండి సంజయ్ అని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు, మూడు సార్లు నేరుగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అలాంటి పనితీరును బండి సంజయ్ తన పదవి కాలంలో చూపారు. ఆయన బీఆర్ఎస్ పై ఎంత పోరాడాలంటే.. ఆ పార్టీ బండి సంజయ్ ను ప్రథమ టార్గెట్ గా పెట్టుకుంది. మూడు సార్లు దారుణమైన పరిస్థితుల్లో అరెస్టులు చేశారు. అయినా బండి సంజయ్ ఎక్కడా తగ్గలేదు. ఈ దూకుడే బీజేపీకి బీఆర్ఎస్‌తో పోటీ పడే పార్టగా మైలేజీ తీసుకు వచ్చింది. అయితే అనూహ్యంగా ఆయనను తప్పించి ఎన్నికలకు ముందు కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. బండి సంజయ్ పై నేతల అసంతృప్తి అనే కారణం చెబుతున్నా.. బీజేపీ లాంటి పార్టీల నేతల అసంతృప్తి పెరగకుండా చేయాలనుకుంటే ఏం చేయాలో వారికి బాగా తెలుసు. కానీ చేయలేదు. ఎందుకు చేయలేదన్నదే ఇక్కడ సందేహం.
ఉన్న పళంగా బండి సంజయ్ ను తొలగించి కిషన్ రెడ్డికి పగ్గాలివ్వడంతో బీజేపీ ఎంత తీవ్రంగా నష్టపోతుందో కళ్ల ముందు కనిపించే ఉదంతాలు కనిపిస్తున్నాయి. మొదటిది.. బీఆర్ఎస్‌తో రాజకీయ అవగాహనకు రావడం. బండి సంజయ్ ను తప్పించడానికి ప్రధాన కారణం.. కేసీఆర్ ఒత్తిడేనని చెప్పుకోవడం. ఇందులో నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు.. తమ పార్టీ అధ్యక్షుడ్ని తప్పించాలని కేసీఆర్ లేదా కేటీఆర్ అడిగితే తప్పించేంత బలహీనంగా అమిత్ షా , ప్రధాని మోదీ ఉంటారని అనుకోరు. కానీ బీఆర్ఎస్ సర్కార్ పై తెగించి పోరాడుతున్న బండి సంజయ్ ను ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు..అదీ కూడా బీజేపీ, బీఆర్ఎస్ కాల్పుల విరమణ ఒప్పందం ఏదో చేసుకున్నట్లుగా వ్యవహరిస్తున్న సందర్భంలో తప్పించడం మాత్రం ఖచ్చితంగా అలాంటి అనుమానాలను సామన్యుల్లో బలపరిచేదే. అదే సమయంలో కిషన్ రెడ్డికి ప్రో బీఆర్ఎస్ ముద్ర ఉంది. ఆయన కేసీఆర్‌కు సన్నిహితుడన్న అనుమానాలూ ఆ పార్టీలో ఉన్నాయి. రెండు పార్టీల మధ్య ఆయన మీడియేట్ చేసేందుకే పదవి ఇచ్చారన్న విశ్లేషణలూ ఇందుకే వస్తున్నాయి.
ఇలాంటి ప్రచారాలు బీజేపీకి ఎంత నష్టం చేస్తాయో చెప్పాల్సిన పనిలేదు. అదే సమయంలో ఈ మార్పుల వల్ల బీజేపీలో పెరుగుతున్న ముసలాన్ని ఆపాలని అనుకోవడం కూడా సాధ్యం కాదు. ఇంకా చెప్పాలంటే… పెరుగుతుంది. ఇలా బీజేపీలో మార్పుల గురించి బయటకు రాగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఉన్న పళంగా నిర్ణయాలు తీసుకోరు కానీ.. ఒక్క నెల రోజుల వ్యవధిలో పార్టీ నుంచి వలస వెళ్లిపోయే నేతల గురించి చెప్పాల్సి పని లేదు. రఘునందన్ రావు చిట్ చాట్ పేరుతో మాట్లాడి పార్టీ కి చేసిన డ్యామేజీ అంతా ఇంతా కాదు. ఇలాంటివి ముందు ముందూ జరుగుతాయి. అంటే.. పదవుల్ని మార్చడం వల్ల అసంతృప్తినీ తగ్గించలేకపోయారు. ఇంకా చెప్పాలంటే పెంచుకున్నారు. ఈటల రాజేందర్ కు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. అదేదో బండి సంజయ్ నే అధ్యక్షునిగా కొనసాగించి ఈటలకు ఇచ్చి ఉంటే సమస్య పరిష్కారమయ్యేది కదా అనేది ఎక్కువ మంది అభిప్రాయం. కానీ మొత్తం రచ్చ రచ్చ చేశారు.
అసలు బండి సంజయ్ ను తప్పించడం అంటే పార్టీకి బలంగా మారిన ఓ వర్గాన్ని దూరం చేసుకోవడమే. ఈ విషయం బీజేపీ అగ్రనేతలకు తెలుసు. అయినా ఎందుకు రిస్క్ తీసుకున్నారు ?
కిషన్ రెడ్డికి కిరీటం పెట్టడం వల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోయే మరో అంశం.. సామాజిక సమీకరణం. రాజకీయాల్లో ఎలా లేదన్నా.. కుల సమీకరణాలు అత్యంత కీలకం. ప్రస్తుతం బీజేపీకి ఖచ్చితమైన ఓటు బ్యాంక్ అవసరం చాలా ఉంది. మున్నూరుకాపు వర్గం బీఆర్ఎస్ పై వ్యతిరేకంగా ఉంది. బీజేపీ వైపు మొగ్గుతున్నారని బండి సంజయ్ తో పాటు ధర్మపురి అర్వింద్ ఎంపీలుగా గెలిచినప్పుడు ఓ అభిప్రాయం వినిపించింది. బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ చీఫ్ గా పెట్టిన తర్వాత ఆ వర్గం బీజేపీ వైపు వచ్చిందని అనుకున్నారు. అయితే హఠాత్తుగా ఆయనను తప్పించి మళ్లీ కిషన్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ వైపు ఉందని ఎవరైనా అంచనా వేస్తారు. ఆ వర్గం బీజేపీ వైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో రారు. అండగా ఉంటుందనుకున్న వర్గాన్ని దూరం చేసుకుని బీజేపీ కొత్తగా ఏం సాధిస్తుందో బీజేపీ కార్యకర్తలకూ అర్థం కావడం లేదు.
ఈటల రాజేందర్ కు బీజేపీ చీఫ్ పోస్ట్ ఇచ్చినట్లయితే ముదిరాజ్ వర్గం అంతా కలిసి వస్తుందని అనుకునేవారు. ఆయనకు కూడా చీఫ్ పోస్టు ఇవ్వలేదు. ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. అది ఆయన స్థాయికి సముచితమే అనుకోవచ్చు..కానీ ఆ పదవికి ఆయన వర్గం అంతా ఓట్ల పరంగా అండగా ఉండే అవకాశాలు లేవు. అంటే.. బీజేపీ ప్రధానమైన ఓటు బ్యాంకును కోల్పోవడమే కాదు.. కొత్తగా ఎవరి మద్దతనూ పొందలేరు. దీని వల్ల బీజేపకి వచ్చేదేమీ లేకపోగా తీవ్రంగా నష్టపోతుంది. ఇదంతా బీజేపీ హైకమాండ్ ఎందుకు చేస్తోంది ?
తెలంగాణలో బీజేపీ గెలిచే చాన్స్ లేదని హైకమాండ్ నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ ను గెలవకుండా చేయడం చాలనే కొత్త చాణక్య వ్యూహాన్ని అమలు చేస్తోందన్న బలమైన అభిప్రాయం అంతాట ఏర్పడుతోంది. అదే నిజం అయితే.. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను గెలిపిస్తున్నాయని చెప్పుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఎదుకంటే రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ ఎప్పుడూ రెండు కాదు.. ఒక్కో సారి జీరో అవుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో