ఎట్టకేలకు స్పందించిన సామ్

By KTV Telugu On 9 October, 2022
image

ఫుల్ హ్యాపీగా ఉన్న ఫ్యాన్స్
మళ్లీ అర్ధం కాకుండా పోస్ట్ పెట్టిన లేడీ సూపర్ స్టార్

కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది సమంత. మీడియా ముందుకు రావడం లేదు. షూటింగ్స్ లో పాల్గొనడం లేదు. దాంతో ఆమెకు ఏమైంది అనేది చర్చనీయాంశంగా మారింది. హెల్త్ బాగోలేదు అన్నారు. అమెరికా వెళ్తోంది అన్నారు. డిప్రెషన్ తో ఇబ్బంది పడుతోంది అన్నారు. ఇంకెదో జరిగింది అని కూడా అన్నారు. కాని ఏ రూమర్ కూ ఎన్నడూ స్పందించలేదు లేడీ సూపర్ స్టార్. ఇక సమంత స్పందించినప్పుడు చూద్దాం అనుకుంటగా, అక్టోబర్ 7న ఒక పోస్ట్ పెట్టి అందరికి షాక్ ఇచ్చింది సమంత. ఇంగ్లీష్ లో తన పెట్ ఫోటోతో ఆ పోస్ట్ పెట్టింది సమంత. వెనక్కి తగ్గాను కానీ ఓడిపోలేదు అంటూ సమంత పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఏ విషయంలో ఆమె వెనక్కి తగ్గింది. ఎందుకు ఓటమి గురించి ప్రస్తావించింది అనేది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. నాగ చైతన్యతో డైవోర్స్ తర్వాత సమంత జీవితం పూర్తిగా మారిపోయింది.గతంలో ఎన్నడూ లేని విధం గా పర్సనల్ లైఫ్ గురించి డిస్కస్ చేస్తోంది. ట్యాటూస్ గురించి, చై తో గొడవ జరిగే సమయం గురించి వివిధ సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అయితే ఆగస్ట్ నుంచి సమంత పూర్తిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయింది. మాజీ భర్త నాగ చైతన్య లాల్ సింగ్ చెద్దా కోసం బాలీవుడ్ వెళ్లడం … ఆ వెంటనే సమంత ఇంటికే పరిమితం కావడం, సోషల్ మీడియా లోనూ యాక్టివిటీ తగ్గించడం అన్ని ఒకేసారి జరిగాయి. ఈ దశలో మూడు నెలల విరామం తర్వాత సామ్ స్పందించడం ఫ్యాన్స్ కొంత రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. మరో వైపు లేడీ స్టార్ నటించిన రెండు కొత్త చిత్రాలు యశోద, శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ లో సమంత బిజీ కావడం ఖాయం. అందుకోసమైనా ఆమె బయటికి రావాలి.. మూడు నెలలు ఇంటికే ఎందుకు పరిమితం అయిందో చెప్పాలి. మరోవైపు విజయం దేవరకొండ తో నటించాల్సిన ఖుషి షూటింగ్ పెండింగ్ లో ఉంది.