తన కంట్లో నలుసులా..చెవిలో జోరీగలా..నిత్యం చికాకు పెట్టేసే నేతలంటే చంద్రబాబు కు ఒళ్లు మంట. అటువంటి నేతలను ఎన్నికలు వచ్చినపుడు టార్గెట్ చేయడం ఆయనకు అలవాటు. అసెంబ్లీలో తనను పదే పదే సవాల్ చేస్తూ విసిగించే నేతలు అసలు అసెంబ్లీలోనే అడుగు పెట్టకుండా చేయాలని ఆయన అనుకుంటారు. చాలా మంది విషయంలో ఆయన తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు కూడా. అయితే ఒక్కరు మాత్రం చంద్రబాబు నాయుడికి అస్సలు కొరుకుడు పడ్డం లేదు. వచ్చే ఎన్నికల్లో అయినా తనకు నిద్రలేకుండా చేస్తోన్న ఆ నేతను ఓడించి తీరాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారని అంటున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ నియోజక వర్గం ఎమ్మెల్యే కొడాలి నాని పేరు చెబితేనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి మండుకొచ్చేస్తుంది. కొడాలి నాని అనే నాయకుడు అసలు అసెంబ్లీలోనే అడుగు పెట్టడానికి వీల్లేదని చంద్రబాబు చాలా సార్లు అనుకున్నారు.అందుకోసం ఎన్నో వ్యూహాలు రచించి అమలు చేశారు. కాకపోతే అవేవీ వర్కవుట్ కాలేదు. 2014ఎన్నికల్లో కొడాలిని ఓడించి తీరతానని శపథం చేశారు. సర్వశక్తులూ గుడివాడపైనే కేంద్రీకరించారు. అయితే ఆయన శక్తి సరిపోలేదు. కొడాలి నాని ఘన విజయం సాధించారు. అది చంద్రబాబుకు మరింత మంట తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మరోసారి కొడాలి నానిని ఓడించడానికి చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్స్ వేసుకున్నారు. మళ్లీ కొడాలి నాని ఘన విజయం సాధించి చంద్రబాబును వెక్కిరించారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం అనంతరం టిడిపి నాయకత్వాన్ని ఎండగట్టడంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత కొడాలి నాని కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు నాయుడిపై నిత్యం నిప్పులు చెరుగుతూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒక మాట అంటే దానికి రెండు మాటలు కలిపి రిటార్ట్ ఇస్తూ వచ్చారు కొడాలి నాని. ఇది చంద్రబాబు నాయుడికి ఏ మాత్రం నచ్చలేదు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలోనే కొడాలి నాని నియోజక వర్గంపైనే రాజకీయాలు మొదలు పెట్టారు. ఆయన నియోజక వర్గంలో క్యాసినో జరుగుతోందంటూ టిడిపి నేతల చేత ఆరోపణలు చేయించారు. స్వయంగా తానూ చేశారు. అయితే ఏవీ వర్కవుట్ కాలేదు.
కొడాలి నాని వేసే పంచ్ లు చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడి పరువును బజారు కీడ్చేలా కొడాలి నాని పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. దాంతో కొడాలి నానికి బూతుల మంత్రి అని పేరు పెట్టారు చంద్రబాబు నాయుడు. అయితే దానికి కూడా కొడాలి నాని గట్టి కౌంటర్లే ఇచ్చారు. టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ప్రజలకూ వెన్నుపోటు పొడిచారని తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు కొడాలి నాని. దీంతో టిడిపి నేతలతో పాటు టిడిపి అనుకూల మీడియా సైతం కొడాలి నానిని టార్గెట్ చేసుకుని వార్తాకథనాలు ప్రచారంలో పెట్టాయి.
కొడాలిని ఎలా ఎటాక్ చేయాలా అని చంద్రబాబు ఆలోచనలు చేస్తోంటే టిడిపిని తన నియోజక వర్గంలో ఎలా పతనం చేయాలా అని కొడాలి నాని కసరత్తులు చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో
గుడి వాడ నియోజక వర్గంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. టిడిపికి ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇది చంద్రబాబు నాయుణ్ని మరింతగా కలచి వేసింది. కొడాలి నానిపై మరింత ఆక్రోశం పెరిగింది.
2024 ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు కొత్త నేతను రంగంలోకి దిగుమతి చేయాలని నిర్ణయించారు. తన కుమారుడు లోకేష్ కు సన్నిహితుడైన ఒక ప్రవాస భారతీయుణ్ని పిలిపించి గుడివాడలో హల్ చల్ చేయిస్తున్నారు చంద్రబాబు నాయుడు. అమెరికాలో బాగా సంపాదించిన ఆ ఎన్నారై అయితే ఎన్నికల్లో డబ్బుల పంపిణీకి కూడా చూసుకోనవసరం లేదన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఈ ఆలోచన మొదట్నుంచీ పార్టీ జెండా మోసిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు కోపం తెప్పించింది
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి