400 కోట్ల క్లబ్ లో పొన్నియిన్ సెల్వన్

By KTV Telugu On 11 October, 2022
image

11 రోజుల్లోనే అరుదైన రికార్డ్ నెలకొల్పిన సినిమా
ఓవర్సీస్ లో కనీవినీ ఎరుగని వసూళ్లు

దసరా కానుగా ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియిన్ సెల్వన్ వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.
సరైన ప్రమోషన్ లేదు. ఫస్ట్ డే మిక్డ్స్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా,
అత్యంత వేగంగా 400 కోట్ల క్లబ్ లో చేరింది. కోలీవుడ్ లో 400 కోట్ల క్లబ్ లో చేరిన మూడవ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది.
2.0, విక్రమ్ సినిమాల తర్వాత 400 కోట్లు కొల్లగొట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించింది పొన్నియిన్ సెల్వన్. ఒక్క తమిళనాడులో మాత్రమే కాదు, మలయాళ, హిందీ , కన్నడ మార్కెట్స్ లోనూ పొన్నియి సెల్వన్ భారీ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచే 150 కోట్లు రాబట్టింది. దాంతో 11 రోజుల్లోనే 400 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ కూడా ఆల్ మోస్ట్ ముగియడంతో వచ్చే ఏడాది సీక్వెల్ ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపాడు మణిరత్నం. రెండు భాగాలకు కలపి 250 కోట్లు ఖర్చు చేసింది లైకా ప్రొడక్షన్స్. కాని మొదటి భాగానికే 500 కోట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో భాగం ఎంత వసూళ్లు అందుకున్నా అదంతా నిర్మాతలకు లాభమే.