ఐనా ఆశచావలేదే.. !

By KTV Telugu On 25 August, 2023
image

KTV TELUGU :-

కేసీఆర్ చెప్పిన ఆ ఒక్క మాట వారిలో ఆశలను సజీవంగా ఉంచిందా. ఈ మూడు నెలల్లో సీన్ మారిపోతందని వాళ్లు ఎదురు చూస్తున్నారా. ఇప్పుడు ప్రకటించిన లిస్టు కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని అసలు గేమ్ నామినేషన్ల నాటికి విడుదల అవుతుందని వాళ్లు ఆశగా ఉన్నారా. ఆ లీడర్స్ తమ పని చేసుకుపోయేందుకు వెనుకాడటం లేదా. ఇంతకీ వాళ్లకి కేసీఆర్ పద్ధతి నచ్చిందా.. నచ్చలేదా…

మానవుడు ఆశాజీవి, పోలిటీషియన్ పాజిటివ్ జీవి. అవసరాన్ని బట్టి సమయానుకూలంగా ప్రతికూల అంశాలను కూడా సానుకూలంగా మార్చుకోవాలనుకునే వాడే రాజకీయ నాయకుడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా మంది నాయకులు. వారి బిడ్డలు అలానే ఆలోచిస్తున్నారు. పార్టీ నామినేషన్ ఆశించి భంగపడినప్పటికీ కొన్ని గంటల వ్యవధిలోనే కోలుకుని ఉందిలే మంచి కాలం ముందుముందునా అని పాడుకుంటున్నారు.

గుత్తా సుఖేందర్ రెడ్డి రెండు మూడు పార్టీలు మారిన నాయకుడు. మాజీ ఎంపీ అయిన గుత్తా ప్రస్తుతం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్. తన వయసు మళ్లి ఇంటికి పరిమిమయ్యే నాటికి తన కొడుకు అమిత్ రెడ్డిని రాజకీయాల్లో సెటిల్ చేయాలన్న ఆలోచన సుఖేందర్ రెడ్డికి ఉంది. దానితో అమిత్ ను లైన్లోపెట్టారు. జనంలో తిరగడం అలవాటు చేశారు. మీడియాకు ఇంటర్వ్యూలు, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం లాంటి చర్యలతో అమిత్ రెడ్డి జనంలో బాగా పాపులర్ అయ్యారు. ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు 25 వేల పంపడం,నల్లొండ జిల్లాలో ఎవరైనా పేదలు ఇబ్బంది పడుతుంటే పది పదిహేను వేలు ఇవ్వడం లాంటివి చేశారు. ప్రజల సమస్యలను గుర్తించి వారికి సాయం చేసేందుకు అమిత్ రెడ్డి ఒక టీమ్ ను కూడా పెట్టుకున్నారు. అమిత్ రెడ్డికి మునుగోడు లేదా నల్గొండ అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తారని ఎదురు చూశారు. ఆ దిశగా అధిష్టానానికి రికమండేషన్లు కూడా చేశారు.

గుత్తా ఫ్యామిలీ మంత్రాంగం ఫలించలేదు. మునుగోడు, నల్గొండ స్థానాలు సిట్టింగులైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డికి మళ్లీ కేటాయించారు. 115 మంది జాబితాలో ఎక్కడా అమిత్ రెడ్డి పేరు లేదు. దానితో బాగా డిసప్పాయింట్ అయిన గుత్తా అమిత్.. అంతలోనే తేరుకున్నారు. ఇప్పడు ప్రకటించిన జాబితాలో ఎవరైనా సరిగ్గా పనిచేయని పక్షంలో వారిని మార్చేసి వేరే కొత్త వాళ్లకు అవకాశం ఇస్తామని ప్రకటించారు. దానితో ఒకరిద్దరిని ఆపి తనకు అవకాశం వస్తుందని గుత్తా అమిత్ రెడ్డి ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాస్త ఓవరాక్షన్ చేసి ఇప్పుడు పూర్తి ఇబ్బందుల్లో పడిపోయారు. తన తనయుడు మైనంపల్లి రోహిత్ కు మెదక్ టికెట్ ఆశించిన ఆయన ఆ పని అసాధ్యమని తెలిసిన తర్వాత ఆర్థిక మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావును ఓడించి తీరుతానని ఆయన పబ్లిక్ గా శబధం చేసి ఇప్పుడు కేటీఆర్ దగ్గర వార్నింగ్ తీసుకున్నారు.ప్రస్తుతం బీఆర్ఎస్లో వినిపిస్తున్న మాట మరొకటి ఉంది. ఇప్పటికీ పద్ధతి మార్చకపోతే మల్కార్ గిరి టికెట్ కూడా చేజారిపోతుందని చెప్పుకుంటున్నారు. మరి మైనంపల్లి ఫ్యామిలీ అర్థం చేసుకుంటుందా… పార్టీ మారతారా చూడాలి.

ఆఖరుగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాత్రం అనుకున్నదీ సాధించారు. తన కుమారుడు సంజయ్ కు టికెట్ ఇవ్వాలని ఆయన చాలా రోజులుగా కేసీఆర్ ను అడుగుతున్నారు. అదనంగా టికెట్ అవసరం లేదని తన టికెట్ ఇస్తే చాలని కూడా ఆయన చెబుతూ వచ్చారు. ఇప్పుడాయాన అభ్యర్థనను కేసీఆర్ మన్నించి కల్వకుంట్ల సంజయ్ కు .. కోరుట్ల టికెట్ ఇచ్చారు. అక్కడ విజయావకాశాలు కూడా బాగానే ఉన్నాయని చెబుతున్నారు.. చూడాలి మరి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి