మెగా ఫ్యామిలీ తో పాటే అల్లు కుటుంబం
క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్
ఏం జరిగిందో తెలియదు కాని, కొన్నాళ్లుగా కొణిదెల వారికి, అల్లు కుటుంబానికి దూరం పెరిగింది. ఆ విషయం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవలసిందిగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరినప్పుడు చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ నుంచే ఈ కుటుంబాల మధ్య దూరం పెరిగిందనే టాక్ మొదలైంది. పైగా బన్ని కి వరుస విజయాలు అందిరావడం, మెగా హీరోలకు దూరంగా ఉండటం, అల్లు బ్రాండ్ ను ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటుండటంతో మెగా ఫ్యామిలీకి ఈ హీరో దూరంగా జరిగాడు అంటూ ప్రచారం మొదలైంది. రెండేళ్లుగా ఈ గ్యాప్ అలాగే ఉండిపోయింది. ఇటీవల అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అల్లు కుటుంబం, మెగా ఫ్యామిలీ మళ్లీ కలిసారు. అలీతో సరదాగా షోకు వెళ్లి అల్లు అరవింద్ అక్కడ మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీస్ మధ్య ఉన్న గ్యాప్ గురించి మాట్లాడారు. రెండు కుటుంబాలు కలిసే ఉన్నాయని, కాకపోతే రెండు కుటుంబాల్లోని హీరోలు ఎవరి దారుల్లో వారు వెళ్తున్నారని, సమస్య అంటూ వస్తే అందరూ ఒక్కటి అవుతారని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ఇక చిరుతో తన బంధుత్వం మాత్రమే కాదు అని అంతకంటే ఎక్కువే అని తమ ఇద్దరిది ప్రాణ స్నేహమని చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్. మెగా ప్రొడ్యూసర్ కామెంట్స్ తో అయినా మెగా , అల్లు ఫ్యాన్స్ కాంప్రమైజ్ కు వస్తారా అనేది చూడాల్సి ఉంది.