ఆ పక్షులకు ఏమైంది?

By KTV Telugu On 7 April, 2022
image

మెక్సికోలో ఊహించని ఘటన అందర్ని ఆలోచనలో పడేసింది. ఎగిరే ఎగిరే పక్షులు ఏదో పిడుగుపడినట్టు కిందపడి పోయాయి . వేలాది పక్షులు ఉత్తర మెక్సికోలోని చిన్న ఊరిలో మూకుమ్మడిగా చనిపోయాయి. ప్రతీ ఏటా ఈ సీజన్ లో కెనడా నుంచి మెక్సికోకు పక్షులు వలస వస్తుంటాయి. అలా వెళ్లే గుంపు ఒక చోటకి వచ్చే సరికి మాత్రం అకస్మాత్తుగా కిందపడి పోయాయి. అసలెందుకు జరుగుతోందని అడిగితే రకరకాల కారణాలు ఉన్నాయి. మెక్సోకోలోని ఒక ప్రాంతంలో అయస్కాంత ప్రభావం వల్లే ఒక్కసారిగా పక్షులు కిందపడి చనిపోయాయని ఒక అభిప్రాయం. రేడియేషన్ వల్లే ప్రాణాలు కోల్పోయితున్నాయని మరో వాదన .


ఎలాంటి కారణం లేకుండా వందలాది ఒక చోట చనిపోవడం మాములు విషయం కాదన్నది స్థానికులు చెప్పే మాట. పక్షులు అలా చనిపోతున్న దృశ్యాలను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు కూడా చేశారు. నడిరోడ్డుపై పక్షులు చనిపోయి ఉన్నాయి. దేనో గుద్దుకుని పడిపోయినట్టు అలా కిందపడిపోవడం మాత్రం నిజంగా విచిత్రమే. అయితే ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉన్నాయి. దీని ప్రభావంతో పక్షులు చనిపోయాయని చెప్పేవారు ఉన్నారు. సమీపంలోని ఫ్యాక్టరీ నుంచి వచ్చిన విషపూరిత గాలి పక్షుల ప్రాణాలు తీసి

ఉండొచ్చని పర్యావరణ నిపుణులు అభిప్రాయం .
5జి టెక్నాలిజీ వల్ల ఈ ఘోరం జరిగిందని కొంతమంది సోషల్ మిడియాలో ఊదరగొడుతున్నారు. పక్షులు ఒకదానికొకటి వేగంగా ఢీకొంటే అలా చనిపోయే అవకాశం కూడా ఉందనే వాళ్లు ఉన్నారు. పక్షుల మృతదేహాల నమునాలను అన్నింటిని సేకరించి పరిశీలిస్తేనే అసలు విషయం ఏదో బయటపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

సాధారణంగా ఆహారం కోసం పక్షులు ఒకచోట నుంచి మరో చోటకు వలస వెళ్తాయి. సంతానోత్పత్తి కోసం కూడా వలసబాట పడటం సహజం. ప్రతీ ఏటా పక్షులు ఇదే ప్రాంతం నుంచి వలస వెళ్తుంటాయి . కాని మెక్సికోలో ఎప్పుడు ఇలా జరగలేదు. పక్షులు మృతి ఏదో చెడు సంకేతమని స్థానికులు లోలోపలే అనుకుంటున్నారు. అసోంలో ఒకచోట అయితే పక్షులు ఏటా ఒక ప్రత్యేకమైన ప్రాంతంలోఆత్మహత్య చేసుకుంటాయి. దీనికి ఇంత వరకు కారణాలు కనుక్కోలేదు. అలాంటిది ఇది కావచ్చేమో..