మునుగోడులో మంత్రి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

By KTV Telugu On 12 October, 2022
image

టీఆర్‌ఎస్‌ మంత్రుల్లో చాలామంది మునుగోడు బాట పడ్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నాయకులు అక్కడ మకాం వేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకోడానికి మంత్రులు ఇంటింటికి తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్లోరైడ్ భూతం నుండి విముక్తి కల్పించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మూడు సంవత్సరాల తర్వాత నియోజకవర్గ అభివృద్ధి గుర్తుకొచ్చిందా అని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి తలసాని చురకలంటించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ను మరిచి, కాంట్రాక్టు ల పైనే శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ కే ఓటు వేయాలని కోరారు. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. స‌ర్వేల్ గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఎనిమేదేళ్ళ‌లో టీఆర్ఎస్ సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ఆయనకు కాలనీవాసులు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు.
స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం ఉప ఎన్నిక‌కు కార‌ణమైనా బీజేపీ అభ్య‌ర్థికి గుణ‌పాఠం చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.
వృద్ధులను అక్కున చేర్చుకొని పింఛన్‌ వస్తుందా అంటూ ఇంద్రకరన్ రెడ్డి ఆరా తీశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డికి ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్య‌ర్థించారు. అంత‌కుముందు శ్రీరామ లింగేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్ర‌త్యేక పూజలు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్ళుతున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వాహ‌నాన్ని ఆపి పోలీసులు త‌నిఖీ చేయడం విశేషం.