తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాదరసంలా పరుగులు పెడుతున్నారు. ప్రత్యర్ధులకు అందని వేగంతో వ్యూహాలు మార్చుకుంటూ టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు. బిజెపితో పొత్తు కోసం సర్వశక్తులూ ఒడ్డి సకల వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే బిజెపి అగ్రనేతలు ఊహించని విధంగా బంపర్ ఆఫర్ తో వారిని ఆశ్చర్యంలో ముంచెత్తినట్లు తెలుస్తోంది. ఆ ఆఫరే కనక నిజం అయితే తెలగుదేశం పార్టీతో పొత్తుకు బిజెపి అగ్రనాయకత్వం మరో ఆలోచనే లేకుండా ఓకే చెప్పే అవకాశాలు ఉంటాయంటున్నారు రాజకీయ పండితులు. ప్రస్తుతం ఈ ఆఫర్ పైనే హస్తినలో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అటు బిజెపిలోనూ ఇటు టిడిపిలోనూ నేతలంతా దీనిపైనే మాట్లాడుకుంటున్నారని అంటున్నారు.
2014 ఎన్నికల్లో టిడిపి-బిజెపి-జనసేన కూటమి కట్టి ఎన్నికల బరిలో దిగాయి. అపుడు జనసేన అభ్యర్ధులను బరిలోకి దింపకుండా టిడిపి-బిజెపికి మద్దతు పలికింది. ఆ ఎన్నికల్లో బిజెపి ఏపీలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ రెండు లోక్ సభ నియోజక వర్గాల్లోనూ విజయాలు సాధించింది. 2019 ఎన్నికల్లో బిజెపికి ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. అటువంటి పార్టీకి ఇపుడు చంద్రబాబు భారీ ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకుంటే బిజెపికి అయిదు లోక్ సభ స్థానాలు 25 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు బిజెపి నాయకత్వానికి ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎన్టీయార్ పేరిట వందరూపాయల నాణెం విడుదల కార్యక్రమ సందర్భంగా జరిగిన సభలో బిజెపి అధ్యక్షుడు నడ్డాకే చంద్రబాబు ఈ ప్రతిపాదన వినిపించినట్లు సమాచారం.
చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆఫర్ నడ్డాకి కూడా నచ్చిందనే అంటున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమత్రి అమిత్ షాతో చర్చించిన తర్వాత డీల్ పై ఏ నిర్ణయం తీసుకోవాలో ఖరారు చేస్తారని అంటున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ నియోజక వర్గాలు 25 లోక్ సభ నియోజక వర్గాలు ఉన్నాయి. బిజెపికి పాతిక అసెంబ్లీ సీట్లు ఇస్తే మరి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన కు ఎన్ని స్థానాలు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 0.98 ఓట్ల శాతం ఉన్న బిజెపికి పాతిక సీట్లు ఇస్తే ఆరు శాతం ఓట్లు సాధించిన జనసేనకు యాభై సీట్లకు తగ్గకుండా ఇవ్వాల్సి ఉండచ్చని ప్రచారం జరుగుతోంది.
వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఓ సారి గుర్తు చేసుకోవాలంటున్నారు రాజకీయ పండితులు. వారాహి యాత్ర సమయంలో టిడిపితో పొత్తు ఖరారు అయ్యాక ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నది ఎన్నికల ముందే నిర్ణయించుకుంటామన్నారు పవన్ కళ్యాణ్. అయితే తమ గౌరవానికి భంగం కలగని రీతిలో సీట్లు కేటాయిస్తేనే కలిసి పోటీ చేస్తాం తప్ప జనసైనికుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకోమని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఆ లెక్కన ఇపుడు బిజెపికే పాతిక సీట్టు ఇస్తే జనసేనకు యాభై నుండి అరవై సీట్లు అడగాలని జనసైనికులు భావించే అవకాశాలున్నాయి.
జనసేన పొత్తు ఉండి తీరాలని భావిస్తోన్న చంద్రబాబు నాయుడు సీట్ల కేటాయింపులోనూ వారిని మరీ అవమానించకుండా జాగ్రత్తపడే అవకాశాలున్నాయంటున్నారు. బిజెపికి 25 అసెంబ్లీ నియోజక వర్గాలు కేటాయించాలని భావిస్తోన్న నేపథ్యంలో జనసేనకు గరిష్ఠంగా 40 అసెంబ్లీ స్థానాలు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు. అదే ఫైనల్ అయితే టిడిపి మిత్ర పక్షాలైన బిజెపి-జనసేనలు రెండింటికీ కలిపి 65 అసెంబ్లీ స్థానాలు కేటాయించాల్సి వస్తుంది. అపుడు టిడిపి 110 నియోజక వర్గాల్లోనే అభ్యర్ధులను బరిలోకి దింపాల్సి ఉంటుంది.
ఒక వేళ చంద్రబాబు నాయుడి ఆఫర్ కు బిజెపి అధినాయకత్వం ఓకే అంటే ఏపీలో 2014 నాటి కాంబో రిపీట్ అవుతుంది. టిడిపి-జనసేన-బిజెపిలు ఒకే వేదికపై ఎన్నికల ప్రచారం చేసే అవకాశాలుంటాయి. కాకపోతే 2014లో జనసేన పోటీలో లేకుండా మద్దతు మాత్రమే ఇచ్చింది..ఈ సారి తాను కూడా పోటీచేయబోతోంది. అంతే అది తప్ప మిగతాదంతా సేమ్ టూ సేమ్ అంటున్నారు రాజకీయ పండితులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…