KTV TELUGU :-
మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్ గా ఎందుకు మారారు. లిక్కర్ స్కాంలో ఆయనే కీలక వ్యక్తి అవుతారా. కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తుందా … ఆమెను తప్పించే ప్రయత్నం జరుగుతోందా.. జైల్లో ఉన్న మనీషి సిసోడియా గతేమిటి…
అప్రూవర్ గా మారడమంటే కేసు నుంచి విముక్తి పొందేందుకు ప్రయత్నించడం లేదా… శిక్షను తగ్గించుకోవడమేనని చెప్పాలి. కేసుకు ఒక అప్రూవర్ ఉంటేనే పెద్ద విషయం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాత్రం ముగ్గురు నలుగురు అప్రూవర్లు తయారయ్యారు. సౌత్ గ్రుపుపై దర్యాప్తు సంస్థలు సీరియస్ గా దృష్టి పెట్టిన కారణంగానే ముందు జాగ్రత్తగా అప్రూవర్లుగా మారుతున్నట్లు భావించాల్సి వస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్యంగా కదలిక వస్తోంది. నిన్నటి దాకా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును విచారించిన ఈడీ అధికారులు అకస్మాత్తుగా గేర్ మార్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బలంగా పని చేసిన సౌత్ లాబీలో కీలకమైన ఓ వ్యక్తి అప్రూవర్‌గా మారారు. దీంతో ఈడీ అధికారులు అతడు చెప్పిన సమాచారం ఆధారంగా విచారణ ప్రారంభించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సుమారు నాలుగు నుంచి ఐదుగుర వ్యక్తులను విచారించినట్టు తెలుస్తోంది..బుచ్చిబాబును ఈడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించారు. పలు కీలక విషయాలు రాబట్టారని తెలుస్తోంది. బుచ్చిబాబు ఇచ్చిన ఆధారాల ప్రకారమే పలువురు వ్యక్తులను ఈడీ అధికారులు విచారించినట్టు తెలుస్తోంది. అయితే ఈడీ అధికారులు సౌత్ లాబీ పై బలంగా తవ్వడంతో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అప్రూవర్ గా మారారని తెలుస్తోంది.
శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డి అప్రూవర్ గా మారి చాలా రోజులైంది. వైసీపీ నేత విజయసాయి రెడ్డి బంధువు శరద్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్ గా మారారు. ఆయనకు ఏపీ ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యత్వం కూడా ఇచ్చింది. ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్ గా మారడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్కాం మొత్తం దక్షిణాది నుంచే జరిగిందని, అవినీతిలో ఎక్కువ లబ్ధి దక్షిణాదివారికే జరిగిందని సీబీఐ, ఈడీ అనుమానిస్తున్నాయి. అందుకే ఎక్కువ ఫోకస్ సౌత్ గ్రూపుపై పెట్టారు. పైగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను కాపాడేందుకు ఫోకస్ మొత్తం ఇతర నిందితులపై పెట్టారని చెబుతున్నారు. దానితో ఉక్కిరిబిక్కిరై తప్పించుకునే మార్గం లేక సరెండర్ అవుతున్నారని చెబుతున్నారు. ఒకప్పుడు మాగుంట తనకేమీ తెలీదని చెప్పుకున్నారు. ఎవరింటికో రాబోయి ఈడీ అధికారులు పొరబాటున తమ ఇంటికి వచ్చారని వాదించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అప్రూవర్ గా మారడమంటే ఎంత మేర ఆయన లింకులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బీజేపీకి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు అసలు టార్గెట్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనే చెప్పాలి. ఆయనకు ఇంకా బెయిల్ రాలేదు. ఆయన్ను గట్టిగా బిగించాలంటే సౌత్ గ్రూప్ సభ్యులనే లోతుగా విచారించాలని భావిస్తున్నారు. రెండు దర్యాప్తు సంస్థలు చేస్తున్నది కూడా అదే. మరో పక్క కవిత తోక ఝాడించకుండా ఆపాలంటే కూడా సౌత్ గ్రూపును కంట్రోల్ లో ఉంచాలి కదా. దర్యాప్తు సంస్థలా మజాకా….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…