ఒకే సారి 115 మంది అభ్యర్ధులను ప్రకటించిన సృష్టించిన బి.ఆర్.ఎస్.అధినేత కేసీయార్ ఇపుడు ఏం చేస్తున్నారు. పార్టీని మూడో సారి అధికారంలోకి తీసుకురావడమే అజెండాగా ఆయన వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. చాణక్యపుటెత్తుల్లో తిరుగులేని మేధావి అయిన కేసీయార్ హ్యాట్రిక్ విజయం సాధించాలంటే ఏం చేయాలా అన్న ఆలోచనలో పకడ్బందీ ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏడుగురు మినహా సిటింగ్ ఎమ్మెల్యేలందరికీ
కాంగ్రెస్ కు సీట్లు పెరిగినా అధికారంలోకి రాలేదని కేసీయార్ అంచనా(కేసీయార్)
తొలి జాబితా విడుదల అయిన వెంటనే కొన్ని నియోజక వర్గాల్లో అసంతృప్తి కనపడింది. గత ఎన్నికల్లో ఇతర పార్టీల తరపున గెలిచి ఆ తర్వాత బి.ఆర్.ఎస్.లో చేరిన వారికి కూడా టికెట్లు ఖాయం చేశారు కేసీయార్. అటువంటి నియోజక వర్గాల్లో పార్టీ ఆరంభం నుంచి ఉన్న నేతలు తమకు టికెట్ రాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి విధేయంగా ఉన్న తమని కాదని వలస నేతలకు టికెట్లు ఇవ్వడమేంటని వారు మండి పడుతున్నారు. కొత్తగూడెం నియోజక వర్గంలో గత ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. తరపున పోటీ చేసి ఓడిన జలగం వెంకట్రావుకు ఈ సారి టికెట్ రాలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచి బి.ఆర్.ఎస్. లో చేరిన వనమా వెంకబేశ్వరరావుకే టికెట్ ఇచ్చారు.ఖమ్మం జిల్లాకే చెందిన మరో సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరావుకూ టికెట్ రాలేదు. గత ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయారు.
అయితే సీనియర్ అయిన తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. అయితే కేసీయార్ తుమ్మలను పక్కన పెట్టేశారు. దీంతో తన అనుచరులతో సమాలోచనలు చేసిన తుమ్మల చివరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోడానికి రెడీ అయిపోయారు. తుమ్మల నాగేశ్వరరావులా వెంటనే బయట పడకపోయినా మరి కొందరు నేతలు చివరి నిముషంలో పార్టీ మారే అవకాశాలున్నాయంటున్నారు.మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడికి మెదక్ సీటు ఆశించారు. అది ఇవ్వకపోవడంతో ఆయన మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో మైనంపల్లిపై వేటు ఖాయమని ప్రచారం జరిగింది. కాకపోతే ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మైనంపల్లి కూడా ముందు దూకుడుమీద మాట అనేసినా ఆ తర్వాత కాస్త తగ్గారు. అయితే తనపై వేటు వేస్తే మాత్రం కాంగ్రెస్ తరపున బరిలో దిగాలని మైనంపల్లి డిసైడ్ అయ్యారు. మైనంపల్లి కాంగ్రెస్ కు పోకుండా అడ్డుకునే వ్యూహం సిద్ధమైందని అంటున్నారు.తొలి జాబితా విడుదల చేసిన తర్వాత కూడా కేసీయార్ అన్ని నియోజక వర్గాల్లో పార్టీ పరిస్థితిపైనా అభ్యర్ధుల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాలపైనా సర్వేలు చేయించినట్లు చెబుతున్నారు. ప్రజల్లో మరీ ఎక్కువ వ్యతిరేకత ఉన్న అభ్యర్ధులను చివరి నిముషంలో మారుస్తారని అంటున్నారు. అదే విధంగా ప్రజల దృష్టిలో మంచి నేతలుగా ముద్రపడి తొలిజాబితాలో చోటు దక్కని వారి విషయంలో పునరాలోచన చేయచ్చని అంటున్నారు. ఈ విధంగా పది పదిహేను నియోజక వర్గాల్లో అభ్యర్ధులను మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.
అంతిమంగా వచ్చే ఎన్నికల్లోనూ మ్యాజిక్ ఫిగర్ సాధించి హ్యాట్రిక్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని కేసీయార్ పంతంగా ఉన్నారు. కొద్ది మార్పులు చేర్పులు చేస్తే పార్టీ అధికారంలోకి రావడం ముమ్మాటికీ ఖాయమని ఆయన నమ్ముతున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు, రైతు బంధు, దళిత బంధు వంటి అద్భుత పథకాలు బి.ఆర్.ఎస్. ను కచ్చితంగా అధికారంలోకి తెస్తాయన్నది కేసీయార్ భావనగా చెబుతున్నారు. కొన్ని నియోజక వర్గాల్లో కొంచెం కష్టపడితే బి.ఆర్.ఎస్. అభ్యర్ధులు విజయాలు సాధించే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కి గత ఎన్నికలతో పోలిస్తే కొద్ది సీట్లు పెరగొచ్చే కానీ అధికారంలోకి వచ్చే పరిస్థితి మాత్రం ఉండదన్నది కేసీయార్ అంచనాగా చెబుతున్నారు
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…
.