చంద్రబాబునాయుడు అరెస్టుతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఒక్క సారిగా మారిపోయాయి. నాలుగు రోజుల నుంచి చంద్రబాబు అనే మాట ఎక్కడ చూసినా వినిపిస్తోంది. అదే సమయంలో దేశంలో అత్యంత ముఖ్యమైన ఈవెంట్ జరిగిపోయిందని ఎవరికీ తెలియదు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీని మానసికంగా దెబ్బతీశామని వైఎస్ఆర్సీపీ గట్టిగా నమ్ముతోంది. ఆయనపై వరుసగా ఆరోపణలు చేస్తూ ఇంకా ఎటాక్ ముదిరిపోయేలా చేస్తామంటున్నారు. ఇది డైరక్ట్ ఎటాక్ కానీ.. బీజేపీపైనా ఇన్ డైరక్ట్ ఎటాక్ జరిగింది. ఆ పార్టీ దేశం కోసం చేపట్టిన అత్యంత కీలకమైన సమావేశం గురించి ఎక్కడా చర్చకు రాలేదు.
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో స్కాం జరిగిందంటూ పెట్టిన కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత రాజకీయం మారిపోయింది. రాష్ట్ర అభివృద్ధికి తన జీవిత కాలం వెచ్చించిన చంద్రబాబును 74 ఏళ్ల వయసులో కక్ష సాధింపు కోసం జైలుకు పంపించారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే ఆయన అవినీతి బయటపడిందని వైసీపీ అంటోంది. మరో వైపు ఆయన అవినీతిపరుడు అంటూ వైసీపీ నేతలు విస్తృతంగా ప్రకటనలు చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో డీలాపడ్డ టీడీపీని మరింతగా నైతికంగా దెబ్బకొట్టేందుకు వైసీపీ అన్ని వ్యూహాలను పాటిస్తోంది. అదే సమయంలో బీజేపీ కి కొట్టిన సైలెంట్ దెబ్బ మాత్రం పెద్దగా ప్రచారంలోకి రావడం లేదు.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుతో వైఎస్ఆర్సీపీ అధినేత ఒక్క దెబ్బతో రెండు పిట్టలు కొట్టినట్లయింది. జోరుగా ప్రజల్లోకి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఒక్క సారిగా ఆగిపోయారు. చంద్రబాబు నంద్యాల పర్యటన తర్వాత జైలుకెళ్లారు. లోకేష్ పాదయాత్ర ఆపేసి .. జైలు వద్ద పడిగాపులు పడుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు అవినీతి పరుడంటూ అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీకి మీడియా , సోషల్ మీడియా సపోర్ట్ ఎక్కువగా ఉండటంతో ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఎదురుదాడి చేస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అవినీతి ఎక్కడ ఉందని.. తమ దగ్గర ఉన్న వివరాలన్నీ బయట పెడుతున్నారు. అదే సమయమంలో ఈ కేసులో పేరు వినిపించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూ వైరల్ అవుతోంది. ఆయన వాంగ్మూలాన్నే ప్రధానంగా చూపించి అరెస్టు చేసినట్లుగా ప్రచారం జరుగుతూండటంతో సంచలనంగా మారింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టాలని విరమించుకున్నారు. మరో రోజు పెడతారో లేదో తెలియదు కానీ.. టీడీపీ మాత్రం ఈ వీడియోలను వైరల్ చేస్తోంది.
ఎలా చూసినా తెలుగుదేశం పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామమే. సాఫీగా ఎన్నికలకు వెళ్లేందుకు అన్ని రకాల ప్రచార ఏర్పాట్లు చేసుకున్నారు. నాలుగున్నరేళ్లు అయిపోయినా అన్నీ ఆరోపణలే తప్ప ఎలాంటి సాక్ష్యాలు చూపించలేకపోయారని అంటున్నారు. ఓ వైపు చంద్రబాబు.. మరో వైపు లోకేష్.. ఇంకో వైపు పొత్తులు పెట్టుకునే ఆలోచన ఉన్న పవన్ కల్యాణ్… రాష్ట్రాన్ని దున్నేయాలనుకున్న సమయంలో ఒక్క సారిగా అంతా బ్రేక్ పడిపోయింది. డిఫెన్స్ లోకి వెళ్లిపోయింది. ఈ అరెస్ట్ అక్రమమా… సక్రమమా అన్న సంగతి పక్కన పెడితే.. క్యాడర్ లో నిరుత్సాహం మాత్రం ఏర్పడుతుంది. వైసీపీ దీన్ని రాజకీయం చేసుకకుంటోంది. చంద్రబాబు అరెస్ట్ చేస్తే ఎవరూ స్పందించలేదని ప్రచారం చేస్తోంది. మాజీ మంత్రులే ప్రెస్ మీట్లు పెట్టి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం… తమపై వేధింపులు పెరిగిపోతున్నాయని… ప్రజల సానుభూతి పొందేందుకు ఇంత కంటే మంచి తరుణం ఉండదని అంచనా వేస్తున్నారు. అందుకే దానికి తగ్గట్లుగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ గేమ్ లో సీఎం జగన్ … పైచేయి సాధించారని అనుకోవచ్చు. చంద్రబాబును రిమాండ్ కు పంపించడమంటే సామాన్యమైన విషయం కాదని.. ఆయన అన్నింటికీ అతీతుడని జరుగుతున్న ప్రచారాన్ని తాము బ్రేక్ చేశామని అంటున్నారు.
ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి బీజేపీని కూడా మాస్టర్ స్ట్రోక్ కొట్టారు. కానీ ఇది ఎవరికీ అర్థం కావడం లేదు. చివరికి బీజేపీ నేతలకు కూడా
రెండు రోజుల పాటు ఢిల్లీలో జీ 20 సమావేశాలు జరిగాయని తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా తెలుసా అంటే… నిజమా ఎప్పుడు జరిగాయని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటారు. ఎందుకంటే.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఏపీలో అడుగు పెట్టినప్పటి నుండే అసలు కథ ప్రారంభమయింది. జీ 20 సమావేశాల గురించి సోషల్ మీడియా, మీడియా ద్వారా వార్తలు తెలుసుకునే ఎవరికీ తెలియదు. ఎందుకంటే జీ 20 వార్తలు ఎవరికీ కనిపించలేదు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ .. ఇండియాలో అడుగు పెట్టారన్న సంగతి తెలిసింది కానీ తర్వాత ఏం చేశారో… ప్రధానితో ఏం మాట్లాడారు.. దేశానికి ఏం గుడ్ న్యూస్ చెప్పారు… మనోళ్లకు గ్రీన్ కార్డులు పెంచుతారన్నారా లాంటి కబుర్లు ఎక్కడా కనిపించలేదు. ఆయన వెళ్లిపోయిన విషయాన్నీ పట్టించుకోలేదు. అమెరికా అధ్యక్షుడ్నే పట్టించుకోలేదంటే.. ఇక నలభై దేశాల అధ్యక్షులు వచ్చారని తెలుస్తుందా ?. చాన్స్ లేదు. మామూలుగా ఎప్పుడైనా అమెరికా అధ్యక్షుడుఇండియాకు వస్తున్నాడంటే… ఆయన విమానం దగ్గర్నుంచి తినడానికి వాడే స్పూన్ గురించి కూడా కథలు కథలుగా చెప్పేవారు. ఇప్పుడు ఆయననే పట్టించుకోలేదు.
కేంద్రం జీ 20 సమావేశాలకు ఆతిధ్యం ఇవ్వడంపై ఏడాది నుంచి ప్రచారం చేస్తోంది. ప్రపంచంలో దేశాన్ని గొప్పగా నిలబెట్టామని. .. నాయకత్వం వహిస్తున్నామని చెప్పాలనుకుంది. కానీ అసలు ఆ నాయకత్వం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం లేకుండా పోయింది. జీ 20లో అసలేం జరిగిందో ఎవరికీ తెలియదు. చెబుతామన్నా ఎవరూ పట్టించుకోలేదు. మూడు రోజుల నుంచి చంద్రబాబు… చంద్రబాబు అని నిమిషం ఉచ్చరించని టీవీ చానల్ లేదు. ఎవరి అజెండా వారిది. అయితే అందరూ తమ వ్యూయర్స్ ను సంతృప్తి పరిచారు. ఎవరి అజెంండా మేరకు వారు వార్తలిచ్చారు. అయితే ఆ అజెండాలో జీ 20 లేదు. దీనికి కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
జీ 20 సమావేశం గురించి విస్తృతంగా ప్రచారం జరిగితే బీజేపీకి పొలిటికల్ గా మైలేజీ వస్తుందని ఆ పార్టీ నేతలు ఆశించడం సహజం. అందుకే దేశవ్యాప్తంగా అద్భుతమైన కవరేజీకి ఏర్పాట్లు చేసుకున్నారు. పీఆర్ అద్భుతంగా నిర్వహించారు. వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అన్ని చోట్లా జీ 20 గురించి చెప్పుకున్నారు కానీ.. ఏపీలో కాదు. బీజేపీకి ఈ విషయంలో ఏ మాత్రం మైలేజీ రాకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారని అందుకే వన్ షాట్ టు బర్డ్స్ అని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
రాజకీయమంటే వ్యూహం. ఆ వ్యూహాలు ఒక్కోసారి ఒక్క దెబ్బకి రెండు పిట్టలు కొట్టినట్లుగా ఉండవచ్చు. లేకపోతే రివర్స్ కావొచ్చు. ఈ ఇష్యూలో సీఎం జగన్ బీజేపీ పెద్దల మద్దతు లేకపోతే… జీ 20 సమావేశాల సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…