బాలయ్య అభిమానికి కోపమొచ్చిందా ?

By KTV Telugu On 26 September, 2023
image

Ktv Telugu :

నందమూరి బాలకృష్ణ సడన్ గా ఎంత యాక్టివ్ అయ్యారో.. ఆయనలోని నెగిటివ్ షేడ్స్ అంత కంటే ఎక్కువగా బయటకు వస్తున్నాయి. అసెంబ్లీలో కనిపించీ కనిపించకుండా ఉండే బాలయ్య… ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలనుకుంటున్నారు. ఆ క్రమంలో ఆయన చేష్టలు విచిత్ర విన్యాసాలుగా మారి… వివాదాలకు, విడ్డూరాలకు దారి తీస్తున్నాయి.. అంతకుమించి ప్రత్యర్థి వైసీపీ వారి అటాకింగ్ గేమ్ కు ఇంధనం కూడా దొరికినట్లయ్యింది. చంద్రబాబు అరెస్టు తర్వాత బాలయ్య షూటింగులు చేస్తున్నారో లేదో తెలియదు కానీ, టీవీల్లో ఎక్కువ కనిపిస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సీట్లు కూర్చున్నప్పుడు బాలయ్య నిండుగా కనిపించినా, సొంత పార్టీ వారికే ఆయన మీద విశ్వాసం కలగలేదు. పార్టీ అనుకూల మీడియా కూడా ఆయన్ను ప్రమోట్ చేసేందుకు ఇష్ట పడలేదు. బాలకృష్ట కంటే ఆయన కూతురు, నారా వారి కోడలు బ్రహ్మణి బెటర్ అని కూడా కొందరు తేల్చేశారు. ఐనా బాలయ్య ఈజ్ బాలయ్య కదా. ఆయన దారిలో ఆయన నడుస్తున్నారు. దాన్ని ఆయన రహదారిగా భావిస్తారు. మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం, ఈలలు వేయడం లాంటి చేష్టలు అసెంబ్లీ వేదికగా కూడా చేసిన చూపించారు మన బాలయ్య…

సీఎం జగన్ ఒకప్పుడు బాలయ్యకు వీరాభిమాని. కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘాల అధ్యక్షుడిగా ఉండే వారని కూడా చెబుతారు. అప్పటి పరిస్థితి వేరు. రాజకీయ ప్రత్యర్థులుగా మారిన తర్వాత కూడా బాలయ్య అంటే జగన్ కు కొంత సాఫ్ట్ కార్నర్ ఉందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో బాలయ్య తీరుతో విసిగిపోయిన జగన్ ..ఆయన సంగతేంటో చూడాలని పార్టీ వారిని ఆదేశించినట్లు సమాచారం. అంతే అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా, పోసాని కృష్ణమురళి వరుసగా మాటల దాడులు మొదలు పెట్టారు. కొందరు బిలో బెల్టు కొట్టుడు కూడా మొదలు పెట్టారు. ఈ విషయంలో వైసీపీ సోషల్ మీడియా సైన్యం రాజకీయ నాయకుల కంటే రెండాకులు ఎక్కువే తిన్నట్లుగా ఉంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. అసెంబ్లీలో వైఎస్ ఆ విషయాన్ని ప్రస్తావించి తామెప్పుడు కక్షసాధింపుకు దిగలేదని చంద్రబాబుతో చెబుతున్న అంశాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

తొడకొట్టినోడికి తొడపాశం పెట్టాలన్నది వైసీపీ ఆలోచన కావచ్చు. బాలయ్యను అటాక్ చేస్తే టీడీపీ వాళ్లు చురుకు ముట్టి కొంచెం స్పీడ్ తగ్గిస్తారన్న లెక్కలు వేసుకుని ఉండొచ్చు.చంద్రబాబు అరెస్టుపై వస్తున్న విమర్శలు, నిరసనల నుంచి కాస్త డైవర్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని భావించి ఉండొచ్చు. ఐనా ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన బాలయ అంటే సీతయ్య తమ్ముడు ఎవరి మాట వినడు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని బాలయ్యే ఆపాలి. ఆ పని మిగతా ఎవరి తరమూ కాదు.

watch this full story video