కోలీవుడ్ ను షేక్ చేస్తోన్న రూమర్
విక్రమ్ రికార్డ్ బద్దలు కొట్టిన పొన్నియిన్ సెల్వన్
పొన్నియిన్ సెల్వన్ సినిమాతో మణిరత్నం మరోసారి స్టార్ డైరెక్టర్స్ రేస్ లోకి వచ్చేశారు. పొన్నియిన్ సెల్వన్ ను మణిరత్నం తెరకెక్కించి విధానం ఎంత గొప్ప్హగా ఉందో ఈ సినిమా వసూళ్లే చెబుతున్నాయి. కేవలం 14 రోజుల్లో ఈ సినిమా తమిళనాట ఇండస్ట్రీ హిట్ గా నిలబడింది. కమల్ నటించిన విక్రమ్ పేరిట ఉన్న రికార్డులను చెరిపేసింది. ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల వసూళ్ల వైపు దూసుకుపోతోంది. పొన్నియిన్ సెల్వన్ తో మణిరత్నం ఏకంగా ఇండస్ట్రీ హిట్ ఇవ్వడంతో , ప్రస్తుతం ఈ దిగ్గజ దర్శకుడితో సినిమా చేసేందుకు రజనీకాంత్ రెడీ అవుతున్నాడు. అన్ని కుదిరి ఉంటే పొన్నియిన్ సెల్వన్ ల్లోనే రజనీకాంత్ నటించాల్సింది. కాని కుదరలేదు. అందుకే వీరిద్దరు ఇఫ్పుడు కొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు కలపాలి అనుకుంటున్నారు.
అయితే ఇందుకు ఒక కండీషన్ ఉంది. అదేంటి అంటే ముందు పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ కావాలి, ఆ తర్వాత సూపర్ స్టార్ తో మణిరత్నం మూవీ ఉంటుంది. గతంలో వీరిద్దరు దళపతి లాంటి బ్లాక్ బస్టర్ ను అందించారు. ఈసారి మాత్రం తమిళ సినీ పరిశ్రమకు తిరుగులేని విజయాన్ని అందించాలి అనుకుంటున్నారు. మరో వైపు రజనీకాంత్ కూడా మణిరత్నంతో సినిమా చేసే లోపు మరో రెండు సినిమాలు పూర్తి చేయాలనుకుంటున్నాడు. అందులో ఒకటి ప్రస్తుతం సైట్స్ పై ఉన్న జైలర్ కాగా, మరొకటి తమిళ దర్శకుడు , డాన్ మూవీ తెరకెక్కించి శిబి చక్రవర్తి.