మోదీ తెలంగాణ టూర్ సక్సెసా ఫెయిల్యారా. ఆయన ఇచ్చిన హామీలేమిటి. మాట్లాడిన మాటలేమిటి… తెలంగాణకు మోదీ ఏమిచ్చారు..ఏమి తెచ్చారు. ఎన్నికల హామీలు ఎలా ఉన్నాయి. మోదీ పాలమూరు పర్యటన బీజేపీలో ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందా. కీచులాటల పర్వానికి తెరతీసింది. మొత్తానికి జరిగిందేమిటి…
ఒక జాతీయనేత వస్తున్నారంటే ఎదురుచూసే జనానికి ఎన్నో ఆశలుంటాయి. అందులోనూ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధానమంత్రి మోదీ వస్తున్నారంటే ఏదోచెబుతారు. అదో చేస్తారన్న విశ్వాసమూ ఉంటుంది. ఆదివారం మోదీ పాలమూరు పర్యటన సందర్భంగానూ అదే నమ్మకమూ జనంలో కలిగింది. ఆయన రొటిన్ గా బీఆర్ఎస్, కాంగ్రెస్ ను తిట్టినా ఇచ్చిన రెండు ప్రధాన హామీలే ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. అంతకు మించి నలుగురైదుగురు కీలక నేతలు డుమ్మా కొట్టడంతో బీజేపీలో ఏం జరుగుతోంది. అంతా సవ్యంగానే ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలతో టైమ్ పాస్ చేస్తే కుదరదు. రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. మరో నాలుగైదు నెలల్లో లోక్ సభకు ఎన్నికలు జరుగుతాయి. ఉత్తరాదిన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో బీజేపీకి మెజార్టీ రావాలంటే తెలంగాణలో కొన్ని ఎంపీ సీట్లయినా గెలివాలి. అదే ఆలోచనలో పార్టీ అన్ని రాష్ట్రాల్లో మోదీ సభలు ఏర్పాటు చేస్తోంది. అదీ మోదీ ఛరిస్మా చూసి ఓటెయ్యాలని అడిగేందుకు ప్రయత్నిస్తోంది. ఆ దిశగానే పాలమూరు సభ తెలగాణ బీజేపీకి ఎన్నికల శంఖారావమని కూడా చెప్పాలి. అందులో ఆయన ఇచ్చిన ప్రధాన హామీలు పసుపు బోర్డు, గిరిజన విశ్వవిశ్వవిద్యాలయం ప్రకటించడం ఇప్పుడు సగటు ఓటర్లను ఆలోచింపజేస్తోంది. ఒకప్పుడు పసుపు బోర్డు కుదిరే పని కాదని బీజేపీ నేతలే వాదించారు.అంతలోనే టర్న్ అరౌండ్ తీసుకుని మరీ మోదీ నోటనే పసుపు బోర్డు మాట చెప్పించారు. శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందన్నట్లుగా మోదీ స్వయంగా ప్రకటించడమంటే చెప్పింది చేస్తాం.. చేసేదే చెప్తాం అన్నట్లుగా ఉందీ పరిస్థితి. ప్రజా గర్జన పేరుతో నిర్వహించిన సభలో మరో హామీ కూడా ప్రకటించారు. ములుగులో సమ్మక్క సారమ్మ పేరుతో 900 కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మార్పు వంటి వరాలను మోదీ తెలంగాణకు ప్రకటించారు.పైగా మోదీ ఒక్క సభ విలువ 13 వేల 500 కోట్ల రూపాయల ప్రాజెక్టులని ఆయన స్వయంగా చెప్పుకున్నారు.
ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్.. ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కేంద్రం ఇన్నాళ్లూ దానిపై ఎటువంటి హామీ ఇవ్వలేదు. దీంతో అరవింద్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే తెలంగాణలో బీజేపీ హైదరాబాద్ తర్వాత కాస్తో కూస్తో బలం ఉంది నిజామాబాద్‌లోనే. పసుపు బోర్డు ప్రకటిం చకపోతే ఇక్కడ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుం దని భావించిన బీజేపీ అధిష్ఠానం.. బోర్డు ఏర్పాటును మోదీ ద్వారా ప్రకటింపజేసింది. కొవిడ్ సమయంలో పసుపు ఎంతో గొప్ప పని చేసిందని. కొవిడ్‌ను తగ్గించడంలో తోడ్పడిందని, అప్పుడే తనకు పసుపు గొప్పతనం తెలిసిందని పసుపు బోర్డు ఏర్పాటు సందర్భంగా మోదీ వ్యాఖ్యానించడం ఓటర్లకు గాలం వేయడమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా నిజామాబాద్ లో సెటిలర్ల ఓట్లు కూడా ఎక్కువే. వాళ్లు బీఆర్ఎస్ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఇక ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదన విభజన చట్టంలోనే ఉంది. ఇంతకాలం ఎదురుచూసిన తర్వాత ఇప్పుడు ఆ కల సాకారమవుతోంది.
ఇక తన ప్రసంగంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పై మోదీ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. పదే పదే నా కుటుంబ సభ్యులారా అంటూ మోదీ తెలుగులో ప్రస్తావించడం కూడా ఓటర్లకు కనెక్ట్ కావడమేనని చెప్పాలి. పాలమూరు బిడ్డలకు శుభాభినందనలు కూడా చెప్పారు. రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ఫ్రభుత్వం మాట తప్పిందన్నారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ రెండూ కుటుంబపార్టీలే. కరప్షన్, కమీషన్ అనే సిద్ధాంతాల మీద తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థను కుటుంబ వ్యవస్థగా మార్చారని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అవీ పొలిటికల్ స్టేట్ మెంట్స్ అయినా సగటు ఓటర్లను ఆలోచింపజేసేవేనని గుర్తించాలి. తమకు కాంగ్రెస్ పోటీ కాదని…. బీఆర్ఎస్ తో తాడో పేడో తేల్చుకుంటామని సందేశమిచ్చేందుకు మోదీ ప్రయత్నించారు. అందుకోసమే పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా వాడేశారు. పార్టీ ఆఫ్ ది ఫ్యామిలీ, బై ది ఫ్యామిలీ,.. ఫర్ ది ఫ్యామిలీ అన్నది వాళ్ల నినాదమన్నారు. ప్రజాస్వామ్యాన్ని వాళ్లు కుటుంబవాదంగా మార్చారన్నారు. ప్రతి కీలక పదవిలో కుటుంబంలోని వాళ్లే కూర్చుంటారన్నారు. మోదీ ఆరోపణల్లో పస ఉందా లేదా అన్నది మాత్రం ఎన్నికల ఫలితాల్లోనే తెలుస్తుందనుకోవాలి.
అబద్ధపు వాగ్ధానాలు కాదు. క్షేత్రస్థాయి పనుల తెలంగాణ కావాలని మోదీ పిలుపునివ్వడం కూడా ఎన్నికల సెంటిమెంట్ ను రెచ్చగొట్టడమే అనుకోవాలి. రాణిరుద్రమ పుట్టిన నేల తెలంగాణ అంటూ ప్రశంసించడం ద్వారా చరిత్ర పట్ల తెలంగాణ ప్రజలకు ఉన్న మక్కువను ప్రస్తావించారు. మహిళా బిల్లును ఆమోదింపజేసుకుంటున్నామంటు అందరినీ కలుపుకుపోయేందుకు ఆయన ప్రయత్నించారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ అన్యాయం చేశారని, తాము వారి ఖాతాలో నేరుగా డబ్బులు వేస్తున్నామని మోదీ చెప్పుకొచ్చారు. జనాభాలో 50 శాతం పైగా ఉన్న అన్నదాతలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం అది. ఈ సందర్భంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రస్తావన కూడా చేశారు. మోదీ అన్ని తెలుసుకునే వచ్చారు. అన్ని అంశాలను టచ్.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…