హంగే లక్ష్యం – ఓట్ల చీలికే మార్గం ! బీజేపీ ప్లాన్ చూస్తే మైండ్ బ్లాంకే !

By KTV Telugu On 10 October, 2023
image

KTV TELUGU :-

తెలంగాణలో హంగ్ ఖాయం…బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అని బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ పార్టీ నేతలకు చెప్పారు. హంగ్ వస్తే  బీజేపీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్ని .. అందరికీ తెలుసు.  బీజేపీ అలాంటి రాజకీయాల్లో నెంబర్ వన్.  కానీ బీజేపీ ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. మరో పార్టీ కలవాలి. అలా కలవాలంటే.. కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లు పోలరైజ్  కాకుండా చూసుకోవాలి. ఆ బాధ్యత కూడా  బీజేపీ తీసుకోవాలి. తీసుకుంటోంది కూడా.  ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల వెనుక తెలంగాణలో కాంగ్రెస్ ను దెబ్బకొట్టే రాజకీయం కూడా ఉందన్న అనుమానాలు ఈ కారణంగానే  వస్తున్నాయి. ఇంతకీ బీజేపీ అమలు చేస్తున్న వ్యూహం ఏమిటి ? ఏపీ రాజకీయాలకు.. తెలంగాణ ఎన్నికలకు బీజేపీ ఎక్కడ లింక్ పెట్టింది ?

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత అక్కడి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అందరూ అక్కడి సీఎం జగన్ మోహన్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకున్నారని విమర్శించడం ప్రారంభించారు. చివరికి తెలంగాణ బీజేపీ నేతలు కూడా అదే మాట అన్నారు. కానీ ఇప్పటికీ ఎక్కవ మంది  ఈ పరిణామాల వెనుక బీజేపీ ఉన్నదని నమ్ముతున్నారు. దీనికి సవాలక్ష కారణఆలు ఉన్నాయి. నిజంగా బీజేపీ  ఉందో ఎవరికీ తెలియదు. బీజేపీ లేదని నారా లోకేష్  బయటకు చెబుతున్నారు. లోపల ఆయన మనసులోనూ ఉండే ఉంటుంది.  బీజేపీ నేరుగా లేకపోవచ్చు కానీ.. ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేసేందుకు తెరవెనుక ప్రమేయం ఉందని మాత్రం రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ముందుగా బీజేపీ ప్రణాళికలు తెలంగాణ మీదనే ఉన్నాయంటున్నారు.

ఎన్డీఏలోకి చంద్రబాబు చేరుతారని గత ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ చంద్రబాబు మాత్రం కాలమే నిర్ణయిస్తుందని చెబుతూ కాలక్షేపం చేస్తూ వస్తున్నారు. దీనికి కారణం ఏపీలో వైసీపీతో బీజేపీ సన్నితంగా ఉండటమే.  ఆ రెండు పార్టీలు దగ్గరగా లేవని చెప్పడానికి .. నిరూపించుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత షరతులు పెట్టారు. కానీ వైసీపీ కి పార్లమెంట్ లో ఉన్న బలం రీత్యా..  బీజేపీ విమర్శలకే పరిమితయింది కానీ.. యాక్షన్ లోకి దిగలేదు. ఈ లోపు తెలంగాణ ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. ఎన్టీఆర్ వంద నాణెం విడుదల సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు కోసం సమయం మించిపోయిందన్నారు. అంటే.. తెలంగాణలో పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పేశారు. నిజానికి రాజకీయ పార్టీల పొత్తునకు సమయం లేకపోవడం అనే ప్రశ్నే ఉండదు. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు అయితే.. ఆ రోజు కూడా సీట్ల సర్దుబాటు చేసుకుంటారు.కానీ చంద్రబాబు సమయం మించిపోయిందని చెప్పారంటే. బీజేపీతో పొత్తు ఆయనకు ఇష్టం లేదన్నమాట. కానీ తెలంగాణలో బీజేపీ పరిస్థితి రాను రాను తీసికట్టుగా మారింది. వ్యూహాత్మక తప్పిదాలు చేశారు. తాము విజయం సాధిస్తామన్న నమ్మకం లేదో మరో కారణమో కానీ.. కింగ్ మేకర్ అవ్వాలన్న లక్ష్యం పెట్టుకుని తమను తాము తగ్గించుకున్నారో కానీ.. బలహీనపడ్డారు. అది వాళ్లు కావాలని చేసుకున్నదేనని జరిగిన పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో  బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి ఎవరూ లేరు. ఒంటరిగా పోటీ చేయాల్సింది.

ఎన్డీఏలోనే ఉన్నానని రోజుకో సారి ప్రకటన చేస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో బీజేపీతో పొత్తుల గురించి మాట్లాడలేదు. తమ పార్టీ పోటీ చేస్తుందని 32 అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లను ప్రకటించారు. ఇవన్నీ దాదాపుగా సెటిలర్లు ఓట్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు. ఏపీలో టీడీపీతో పొత్తు ప్రకటించారు కానీ.. తెలంగాణలో టీడీపీ గురించి ఆలోచించలేదు. అలాగే ఎన్డీఏలో ఉన్నామని  చెబుతున్నా… బీజేపీ గురించి ఆలోచించలేదు.  ఏకపక్షంగా తాము ఆ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.  ప్రకటన తర్వాత కూడా  బీజేపీ నేతలు స్పందించలేదు. ఇరప్పుడు టీడీపీ కూడా రేసులోకి వచ్చింది. చంద్రబాబు అరె్స్టు తర్వాత తెలంగాణ టీడీపీ నేతలు రిలాక్స్ అయ్యారు కానీ.. టీడీపీ సానుభూతిపరులు యాక్టివ్ అయ్యారు. చంద్రబాబుపై నిద్రాణంగా ఉన్న అభిమానం ఒక్క సారిగా తెరపైకి వచ్చింది. ర్యాలీలు చేయడం ప్రారంభించారు. ఈ పరిస్థితి చూసి బీఆర్ఎస్ నేతలంతా చంద్రబాబు అరెస్టును ఖండించడం ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టు బాధాకరమంటున్నారు. కానీ వారు అలా అనడానికి కూడా తెర వెనుక రాజకీయాలే కారణం. ఎందుకంటే చంద్రబాబు అరెస్టు అయినప్పుడు వీరెవరూ స్పందించలేదు.  20రోజుల అయిన తర్వాతనే స్పందించడం ప్రారంభించారు. ఎందుకంటే జరగబోయే రాజకీయ పరిణామాలు వీరికి  అర్థమయ్యాయి.. కౌంటర్ ఇవ్వడానికే ప్రారంభించారని   భావించవ్చచు.

తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరే అనుకుంటున్నారు. కానీ  ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి సీన్ మారిపోతుందని అంటున్నారు. బీఎల్ సంతోష్ చెప్పినట్లుగా హంగ్ కోసం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ వేశారు. అందులో భాగంగానే పొత్తులు కూడా ఉండబోతున్నాయి. ఓట్లు కాంగ్రెస్ వైపు పోలరైజ్ కాకుండా చేయబోతున్నారని అంటున్నారు.

చంద్రబాబనాయుడు అరెస్ట్ తర్వాత ఐటీ ఉద్యోగుల ర్యాలీలకు తెలంగాణ ప్రభుత్వం ఆటంకాలు కల్పించింది. దీంతో మరింత పట్టుదలకుపోయిన ఉద్యోగులు ర్యాలీలు చేశారు. ఆ ర్యాలీలు సెటిలర్లు ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ జరిగాయి. ఇది బీఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పి తీసుకు వచ్చింది. ఇప్పటి వరకూ సెటిలర్లు బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. ఈ పరిణామంతో వారు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో సెటిలర్లు బీఆర్ఎస్‌కు తప్ప ఎవరికైనా ఓటు వేయమని పిలుపునిస్తున్నారు.ఇక్కడ  బీజేపీ ట్విస్ట్ ఇవ్వబోతోందని చెబుతున్నారు.  చంద్రబాబు కేసు పరిణామాల్లో త్వరలో కీలక ప రిణామాలు చోటు చేసుకుంటాయని.. తెలంగాణలో ముందుగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఎన్నికల్లో పోటీ చేయబోతోందన్న ప్రచారం ఊపందుకుంటోంది. సెటిలర్లందర్నీ బీఆర్ఎస్‌కు దూరం చేయడం ద్వారా..ఇప్పటికే ఆ పార్టీకి పూర్తి మెజార్టీ రాని పరిస్థితులు కల్పించారనేది బీజేపీ వ్యూహాలు తెలిసిన వాల్లు చెబుతున్న అంశం. అదే సమయంలో సెటిలర్లు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా… టీడీపీ, జనసేనతోనే ఉండేలా బీజేపీ కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకుని పొత్తులు పెట్టుకోబోతోందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ  రాజకీయ పరిస్థితుల్లో బీజేపీకి రెండు, మూడు సీట్లు వస్తాయని ఏ సర్వే కూడా గట్టిగా చెప్పడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో  ఓట్లు కొంత పెరిగినా సీట్లు మాత్రం గత ఎన్నికల  మాదిరిగానే వస్తాయన్న  అంచనాలు ఉన్నాయి. కానీ జనసేన , టీడీపీ కలిస్తే మాత్రం .. సీన్ మారిపోతుంది. కనీసం పిదేహను నంచి ఇరవై స్థానాలు తెచ్చుకుంటే.. ఆటోమేటిక్ గా హంగ్ వస్తుంది. ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది సెటిలర్ల ఓట్లు తమ వైపు ఉంటాయని అంచనా వేసుకోవడం వల్లనే. వారు బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నారని తమ వైపు చూస్తారని కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఒక వేళ ఆ సెటిలర్ల ఓట్లు తారుమారు అయితే.. కాంగ్రరెస్ పార్టీ కూడా యాభై సీట్లకు తక్కువ దగ్గరే నిలిచిపోయినా ఆశ్చర్యం లేదు. అంటే అప్పుడు హంగ్ వస్తుంది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కీలకం అవుతుంది. అదే జరిగితే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నా..  బీఆర్ఎస్ కలిసి ఏర్పాటు చేయాలనుకున్నా..క్షణాల్లో చేసేయగలదు. కాంగ్రెస్ మాత్రం అధికారానికి మరోసారి దూరంగా ఉండిపోతుంది. అదే జరిగితే.. కాంగ్రెస్ తెలంగాణలో ఇక కోలుకోవడం కష్టం.

అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అన్నీ కాంగ్రెస్ వైపు పోలరైజ్ కాకుండా బీజేపీ వేసిన మాస్టర్ ప్లాన్ కారుణంగానే ఏపీలో రాజకీయాలు జరుగుతున్నాయని  అంచనా వేస్తున్నారు. ఇదే నిజం అయితే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే… రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన  పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏం జరుగుతుందనేది వెయిట్ అండ్ సీ

రాజకీయాల్లో మంచీ చెడులు ఉండవు. తమకు ఏది  మంచి అయితే అదే మంచి అని రాజకీయ పార్టీలు డిసైడ్ అవుతాయి. ప్రస్తుత రాజకీయాల్లో అది మరింత పీక్స్‌కు చేరింది. ముందు ముందు ఇంకెన్ని ప్లాన్డ్డ్ పొలిటికల్ సీన్లు చూడాల్సి వస్తుందో.. బీ రెడీ

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి