శ్రీనివాస గౌడ్ హ్యాట్రిక్ కొడతారా

By KTV Telugu On 11 October, 2023
image

KTV TELUGU :-

మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగనుంది. త్రిముఖపోటీ జరుగనుంది.అధికార బీఆర్ఎస్‌కు దీటుగా ఇటు బీజేపీ,అటు కాంగ్రేస్‌లు తమ సత్తాచాటేందుకు సమాయత్త మవుతున్నాయి.చేసిన అభివృద్ది..తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్‌కే జనాలు మరోసారి పట్టం కాడతారని ఆ పార్టీ భావిస్తుంది.పాతసీటును నిలుపుకునేందుకు కాంగ్రేస్ చూస్తుంటే బీజేపీ పాలమూరు సీటుపై ఫోకస్ పెట్టింది.

మహబూబ్ నగర్ లో మూడోసారి విజయంపై శ్రీనివాస గౌడ్ కన్ను( శ్రీనివాస గౌడ్)

కాంగ్రెస్ తరపున బరిలో దిగడానికి యెన్నెం శ్రీనివాసరెడ్డి యత్నాలు(యెన్నెం రెడ్డి శ్రీనివాసరెడ్డి)

బిజెపి తరపున రేసులో ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి(జితేందర్ రెడ్డి)

రాహుల్ గాంధీ జోడో యాత్రతో కాంగ్రెస్ లో పెరిగిన జోష్(రాహుల్ గాంధీ/రేవంత్ రెడ్డి)

తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014,2018 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ సెగ్మెంట్‌లో  బీఆర్ఎస్ విజయం సాధించింది.గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర  గౌరవాధ్యక్షుడుగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్ పోటీ చేసి విజయం సాధించారు.రెండవసారి గెలిచిన తర్వాత ఆయన మంత్రి అయ్యారు.మూడోసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు.మంత్రిగా నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్న ఆయన మరోసారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిత్యం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరుంది.

బైపాస్ రోడ్‌,,పర్యాటకంగా మయూరి పార్క్,పెద్ద చెరువు ట్యాంక్‌బండ్,శిల్పారామం,నెక్లెస్‌రోడ్డు, తీగల వంతెన,పట్టణంలో కూడళ్ల అభివృద్ది,సుందరీకరణ ఆయనకు కలిసివచ్చే అంశాలుగా ఉన్నాయి.ఆనారోగ్యంతో ఆస్పత్రులకు వెళ్లిన వారికి పెద్దసంఖ్యలో ముఖ్యమంత్రి సహయనిధి నుంచి డబ్బులు మంజూరు చేయించి మన్ననలు పొందుతున్నారు.డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంలో అన్ని నియోజవర్గాల కంటే ముందు వరుసలో ఉన్నా నిర్మాణం జరిగిన ఇళ్ల పంపిణీలో  అవినీతి ఆరోపణలు రావటం కొంత ఇబ్బందిగా మారింది.పరిస్ధితి తనకు తెలిసిన వెంటనే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దిద్దుబాటు చర్యలకు  దిగారు.అక్రమార్కులపై కేసులు కూడ నమోదయ్యాయి.

ఓ కార్యక్రమ ర్యాలీలో బహిరంగంగా గాలిలో కాల్పులు జరపటంతో విమర్శలు ఎదుర్కొన్నారు.హత్య కుట్ర కేసు వ్యవహారం కూడ ఆయనకు కొంత మైనస్‌గా మారింది.జిల్లా జనరల్ ఆస్పత్రి అభివృద్ది కోసం విశేష కృషి చేశారు.ముఖ్యంగా కరోనా సందర్భంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులు ఇక్కడ మెరుగైన వైద్యసేవలు అందేలా వసతులు కల్పించారు.ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు బలవంతంగా ఇతర పార్టీల వారిని తన పార్టీలో చేర్చుకుంటున్నారని లేకుంటే కక్షసాధింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుచరులు భూ ఆక్రమణలకు దిగుతున్నారనే అపవాదు కూడ ఉంది.తన అనుచరులకు పెద్దపీట వేసి ఉద్యమకాలంలో పనిచేసిన వారిని విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

స్వంతపార్టీలో ఆయనపై వ్యతిరేకగాని,ప్రత్యర్దులు కూడ లేరు.ఇతర పార్టీల్లో ఆయనను తట్టుకుని నిలిచే నేతలు ఇటు కాంగ్రేస్,బీజేపీల్లో స్దానికంగా లేకపోవటం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.సాగునీటి విషయంలో ఇంకా పనులు పూర్తికాకపోవటంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి అత్యదికంగా కాంగ్రేస్ పార్టీకి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు.చాలా మంది మంత్రి పదవులు సైతం పొందారు.కాని గడచిన మూడున్నర దశాబ్దాలుగా ఇక్కడ కాంగ్రేస్ పార్టీ నుంచి అభ్యర్ది గెలువలేదు.ఈసారి మంత్రికి బలమైన అభ్యర్దిని పోటీలో దింపాలని యోచిస్తోంది.ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రేస్‌లో చేరిన మాజీఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రేస్ తరపున ఈసారి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది.అయితే ఇక్కడి నుంచి  ఓబేదుల్లా కోత్వాల్,సంజీవ్‌ముదిరాజ్,ఎన్పీవెంకటేష్ తదితరపేర్లు కూడా వినిపిస్తున్నాయి.

కర్ణాటక ఫలితాలతో ఢీలాపడ్డ బీజేపీ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి,మాజీమంత్రి చంద్రశేఖర్‌తోపాటు మరో రెండు మూడు పేర్లు పోటీ చేసే అభ్యర్దుల జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ముదిరాజ్,యాదవ సామాజిక వర్గం ఓట్లు కూడ ఫలితం ప్రభావితం చేసే స్దాయిలో ఉన్నాయి.ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉంటున్నవారు,ఉద్యోగుల ఓట్లు కూడ ఎక్కువగ ఉన్నాయి.దీంతో ఫలితంపై అన్ని అంశాలు ప్రభావితం చూపే అవకాశం ఉంది.మొత్తంగా మహబూబ్‌నగర్ సెగ్మెంట్‌లో ఎవరంతకు వారు తమ అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి