జహీరాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్
ఈ సారి రాజకీయాల గురించి ఆలోచించని మాజీ మంత్రి గీతారెడ్డి
బీజేపీలో ఉన్న ఎ.చంద్రశేఖర్ ను పార్టీలోకి తీసుకుని జహీరాబాద్ టిక్కెట్ ఇప్పించిన రేవంత్
చాలా కాలంగా జహీరాబాద్‌లో కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్య
బలమైన క్యాడర్ కాంగ్రెస్ బలం – సెంటిమెంట్ బీఆర్ఎస్ అస్త్రం
ఉమ్మడి మెదక్ జిల్లాలోని రిజర్వుడు నియోజకవర్గాల్లో కీలకమైనది జహీరాబాద్. ఓ రకంగా కాంగ్రెస్ కంచుకోట. గీతారెడ్డి ఆ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమ ఎఫెక్ట్ తో వరుసగా రెండు సార్లు ఓడిపోయారు. దీంతో ఆమె ఈ సారి పోటీకి అనాసక్తంగా ఉన్నారు. పార్టీని పట్టించుకోలేదు. మరో వైపు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావు … మాస్ లీడర్ గా ఎదగలేకపోయినా హరీష్ రావు సపోర్టు, తెలంగాణ సెంటిమెంట్ తో బీఆర్ఎస్ హవా కొనసాగిస్తున్నారు. గీతారెడ్డి పట్టించుకోకపోవడంతో..సరైన నాయకత్వం లేక ఇటీవలి కాలంలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ ను పార్టీలోకి తీసుకొచ్చి జహీరాబాద్ టిక్కెట్ ప్రకటించారు. నియోజకవర్గానికి ఎ.చంద్రశేఖర్ కొత్త. కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని ఆయన ఎలా ఏకతాటిపైకి తెస్తారన్నదానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో 35 శాతం ముస్లిం ఓటర్లు ఉంటారు. వారు ఎవరి వైపు మొగ్గితే విజయం వారికి లభిస్తుంది. ఈ సారి మజ్లిస్ మద్దతు బీఆర్ఎస్‌కు ప్రకటించినా…. వారిలో కాంగ్రెస్ వైపు మొగ్గు ఉందన్న ప్రచారంతో… కాంగ్రెస్ లో ఆశలు పెరుగుతున్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…