గజ్వేల్ కేసీఆర్‌కు తిరుగుందా ?

By KTV Telugu On 16 October, 2023
image

KTV TELUGU :-

 

గజ్వేల్ లో కేసీఆర్ వర్సెస్ నర్సారెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్ ?
కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేరు ప్రకటన
రెండు సార్లు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన కేసీఆర్
ఈ సారి రెండో స్థానం కామారెడ్డి నుంచి పోటీ
గజ్వేల్ లో ఓటమి భయమని విపక్షాల విమర్శలు
కేసీఆర్ గెలుపునకు ఢోకా ఉండదని అంచనాలు

ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తెలంగాణలో ప్రతీ సారి హాట్ టాపిక్ గా ఉంటుంది. దీనికి కారణం.. అక్కడ నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తూండటంతో తొలి సారి కేసీఆర్ టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిపై 19వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. గత ఎన్నికల్లో అదే ప్రత్యర్థిపై ఆయన మెజార్టీ 58వేలకు చేరుకుంది. చివరికి వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మాత్రమే కేసీఆర్ కు ప్రత్యర్థిగా ఉన్నారు. అన్ని పార్టీల ద్వితీయ శ్రేణి నేతలంతా బీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో ప్రతీ గ్రామంలోనూ బీఆర్ఎస్ నేతలే ఉన్నారు. రెండు, మూడు గ్రూపులుగా తయారయ్యారు. తూంకుంట నర్సారెడ్డి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించవచ్చు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ పైఎలాంటి ఆశలు లేవు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేసే అవకాశం ఉంది. తాను రెండు చోట్ల పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. గజ్వేల్ లో పోటీకి చాలా రోజుల నుంచి సన్నాహాలు చేసుకుంటున్నారు. హైకమాండ్ ఆయనకు చాన్సిస్తే… నియోజకవర్గంలో ఎన్నిక హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే ఎలా చూసినా కేసీఆర్ కే అడ్వాంటేజ్ ఉంది. కానీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి