నాగం ఆగం ..జానా అంతంతమాత్రం

By KTV Telugu On 16 October, 2023
image

KTV TELUGU :-

తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితా సంతృప్తినవ్వలేదు. పార్టీని అంటిపెట్టుకుని నమ్ముకుని ఉన్న నేతలకు మంచే జరిగినట్లు అనిపించినా… కొందరికి మాత్రం అవకాశం రాలేదు. ఉదయ్ పూర్  డిక్లరేషన్ ను సైతం పక్కన పెట్టి ఒక కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చే సంప్రదాయానికి తెరతీశారు…

గెలుపు గుర్రాలుగా  నమ్మకం కలిగించిన వాళ్లు, లాబీయిస్టులు, భయపెట్టిన వాళ్లు, టికెట్ రాకపోతే చూసుకుంటాం అని చెప్పిన వాళ్లు .. ఇలా కాంగ్రెస్ అధిష్టానం అందరికీ అవకాశాలిచ్చింది. ఒకరిద్దినీ బాగా నిరాశ పరిచిన మాట వాస్తవం. వాళ్లకు భవిష్యత్తులో టికెట్ ఇస్తారో లేదో కాలమే సమాధానం   చెబుతుందన్న చర్చ నడుమ…ఒకటి రెండు కుటుంబాలకు మాత్రం బాగా ప్రయోజనం కలిగింది. ఒక రకంగా కాంగ్రెస్  కూడా  బీజేపీ పార్ములానే పాటించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ అధిష్టానం ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించినట్లే… తెలంగాణలో కూడా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించింది. మల్కాజ్  గిరి ఎమ్మెల్యే అయిన రేవంత్  రెడ్డి 2018లో తాను ఓడిపోయిన కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సారి నల్లొండ అసెంబ్లీకి నామినేషన్ వేస్తారు.  నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్  రెడ్డి ఈ సారి గతంలో తాను గెలిచిన హుజుర్ నగర్ సీటును ఖాయం చేసుకున్నారు.పోయిన వాళ్లు పోగా మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలకు  మళ్లీ టికెటిచ్చారు. జగ్గారెడ్డి, సీతక్క, భట్టి, పోడెం వీరయ్య, శ్రీధర్ బాబు అసెంబ్లీ బరిలో కొనసాగుతారు.పనిలో  పనిగా రెండు కుటుంబాలకు రెండేసి టికెట్లు ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన భార్య  పద్మావతికి టికెట్ కేటాయించారు.

అలాగే బీఆర్ఎస్ నుంచి వచ్చిన మైనపల్లి హన్మంతరావుకు మల్కాజ్ గిరి, ఆయన కుమారుడు  రోహిత్ కు మెదక్ టికెట్ ఇచ్చేశారు. 55 మంది జాబితాలో 15 మంది రెడ్లు కాగా, 12 మంది ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ముగ్గురు ముస్లింలు, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం నాయకుడు ఉన్నారు.  కేసీఆర్ పోటీ చేసే కామారెడ్డి నియోజకవర్గం నుంచి షబ్బీర్ అలీ పేరు ఖరారు చేస్తారని భావించినా ఎందుకో తొలి జాబితాలో ఆ సీటు లేదు.

టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగం జనార్థన్ రెడ్డికి మొండిచేయి చూపించారు. ఒకప్పుడు టీడీపీ మంత్రివర్గం సీనియర్ మంత్రిగా ఉన్న నాగం  జనార్థన్  రెడ్డి.. తెలంగాణ ఉద్యమకాలంలో వీక్ అయిపోయారు. తర్వాత కాలంలో టీఆర్ఎస్ లో చేరలేక అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఎంత ప్రయత్నించినా అటు రేవంత్ రెడ్డి, ఇటు కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై కనికరించలేదు. పైగా ఆయనా, రేపంత్ రెడ్డి ఇద్దరూ ఉమ్మడి మహబూబ్  నగర్ జిల్లాకు చెందిన వారే. ఇక రెండు టికెట్లు ఆశించి మాజీ హోం మంత్రి జానా రెడ్డి భంగ పడ్డారు. ఆయనకు టికెట్ ఇవ్వలేదు.

ఆయన కుమారుడు కుందూరు జయవీర్ కు  నాగర్జున సాగర్ టికెట్ ఇచ్చారు. అలాగే మాజీ మంత్రి గీతా రెడ్డికి జహీరాబాద్ టికెట్ కేటాయించలేదు. మరో  పక్క ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తారనుకుంటే జాబితాలో ఆ రెండు  నియోజకవర్గాల ఊసే లేదు. బహుశా రెండో జాబితాలో వారి పేర్లు ఉండొచ్చేమో. టికెట్ల కేటాయింపులో ప్రామాణికం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకంగా ఉంది. వరుసగా రెండు సార్లు ఓడిపోయిన సుదర్శన్ రెడ్డికి బోధన్ లో టికెటిచ్చారు. చాలా  సార్లు ఓడిపోయిన గడ్డం వినోద్ కు కూడా నామినేషన్ ఇచ్చారు. జానారెడ్డి, గీతా రెడ్డి మాత్రం ఆ అదృష్టానికి నోచుకోలేదు. కొల్లాపూర్ టికెట్‌ను జూప‌ల్లి కృష్ణారావు.. చింత‌ల‌ప‌ల్లి జ‌గ‌దీశ్వ‌ర్ రావును కాద‌ని ద‌క్కించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ పాత కాపులను మరీ అసంతృప్తిలోకి నెట్టకుండా వారికి అవకాశం కల్పిస్తూనే  కొత్తవారికి  కూడా చాన్సిచ్చింది ఇటీవలే పార్టీలో చేరిన నలుగుదైరుగురికి టికెట్ ఇవ్వడం ద్వారా అందరినీ అకామడేట్ చేస్తామని చెప్పుకుంది. మరో పక్క ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ దక్కని కొందరు ప్రముఖులకు లోక్ సభ ఎన్నికల్లో నామినేషన్లు ఇస్తారని చెబుతున్నారు….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి